
వైఎస్ సంక్షేమ పాలన తేవడమే వైఎస్సార్ టీపీ లక్ష్యమని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రకటించిన ఆమె సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో పేదరికం పోలేదని వ్యాఖ్యనించారు. రూపాయి బియ్యం కోసం ఇంకా రేషన్ షాపుల ఎదుట లైన్లు ఉంటున్నాయని పేర్కొన్నారు. అధికారం ఉన్నప్పుడే ఫామ్ హౌస్ చక్కబెట్టుకుంటున్నాడు. కేసీఆర్ కుటుంబం దోచుకుని దాచుకుంటోంది. తప్పైందని ముక్కు నేలకు రాస్తే కేసీఆర్ పాపం పోతుందా అని అన్నారు.