Andhra Pradesh: పీఆర్సీ నాన్చడంలో ప్రభుత్వ దురుద్దేశం ఏమిటో?

Andhra Pradesh: పీఆర్సీ నివేదిక బయట పెట్టాలని ఉద్యోగ సంఘాలు కోరుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఉద్యోగుల డిమాండ్లు ఖాతరు చేయడం లేదు. ఫలితంగా పీఆర్సీ ఆలస్యం అవుతూనే ఉంది. ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోతోంది. ఫలితంగా ఉద్యోగుల ఆశలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత కాలం పీఆర్సీ విషయంలో తాత్సారం చేస్తారో కూడా అర్థం కావడం లేదు. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయడానికి ఇంకెంత […]

Written By: Srinivas, Updated On : January 1, 2022 4:43 pm
Follow us on

Andhra Pradesh: పీఆర్సీ నివేదిక బయట పెట్టాలని ఉద్యోగ సంఘాలు కోరుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఉద్యోగుల డిమాండ్లు ఖాతరు చేయడం లేదు. ఫలితంగా పీఆర్సీ ఆలస్యం అవుతూనే ఉంది. ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోతోంది. ఫలితంగా ఉద్యోగుల ఆశలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత కాలం పీఆర్సీ విషయంలో తాత్సారం చేస్తారో కూడా అర్థం కావడం లేదు.

CM Jagan

పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయడానికి ఇంకెంత కాలం నిరీక్షించాల్సి వస్తోందో తెలియడం లేదు. ఉద్యోగులపై కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిట్ మెంట్ విషయంలో మాత్రం ఉద్యోగులు కోరుతున్న దానికంటే తక్కువ ఇచ్చేందుకు నిర్ణయించింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన వస్తోందని సమాచారం. ప్రభుత్వం 27 శాతం ఇస్తానని చెబుతోంది. ఉద్యోగులు మాత్రం 39 శాతం ఇవ్వాలని అడుగుతున్నాయి. దీంతో ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య పొసగడం లేదు.

Also Read: 2021 రౌండప్: జగన్.. ఈ ఏడాది మాట తప్పా.. మడమ తిప్పాడు.. విసిగించాడు

ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వానికి సఖ్యత కానరావడం లేదు. పీఆర్సీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించినా ఫలితం మాత్రం కానరాలేదు. దీంతో పీఆర్సీ ఉద్యోగులకు వరంలా కాకుండా శాపంగా మారుతోంది. వారి తలరాతలు మారుతాయని భావించినా వారి ఆశలు మాత్రం అడియాశలే అవువుతున్నాయి. ప్రభుత్వ వైఖరితో ఉద్యోగులు మరోమారు ఉద్యమించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

అయితే ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ఉద్యోగులు సమ్మె చేస్తే ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ప్రభుత్వంపై సమ్మె చేయాలని ఉన్నా చేయడం లేదు. దీంతో ప్రభుత్వం కూడా ఓ ప్లాన్ ప్రకారమే ఉద్యోగులను వేధించే స్థితికి చేరుకుందని తెలుస్తోంది. పీఆర్సీని జాప్యం చేసి వారిలోని సహనాన్ని పరీక్షిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు.

Also Read: సీఎం జగన్ మనిషేనా…? మరి ఎందుకు ఇలా!

Tags