https://oktelugu.com/

Bandi Sanjay: జీవో 317కు సవరణ చేయాల్సిందే.. బండి సంజయ్

Bandi Sanjay: ఎప్పుడు సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ సానుకూలంగా మాట్లాడారు. సీఎం తీసుకున్న నిర్ణయం సరైనదే అని కితాబిచ్చారు. కానీ అందులో కొన్ని మార్పులు చేయాలని మాత్రం చెప్పారు. దీంతో టీఆర్ఎస్ నేతలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. బండి సంజయ్ టీఆర్ఎస్ గురించి ఇంత కూల్ గా మాట్లాడటంలో ఆంతర్యమేమిటో అర్థం కావటం లేదని చెబుతున్నారు. కానీ బండి సంజయ్ మాత్రం ఉద్యోగుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 1, 2022 / 04:34 PM IST
    Follow us on

    Bandi Sanjay: ఎప్పుడు సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ సానుకూలంగా మాట్లాడారు. సీఎం తీసుకున్న నిర్ణయం సరైనదే అని కితాబిచ్చారు. కానీ అందులో కొన్ని మార్పులు చేయాలని మాత్రం చెప్పారు. దీంతో టీఆర్ఎస్ నేతలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. బండి సంజయ్ టీఆర్ఎస్ గురించి ఇంత కూల్ గా మాట్లాడటంలో ఆంతర్యమేమిటో అర్థం కావటం లేదని చెబుతున్నారు. కానీ బండి సంజయ్ మాత్రం ఉద్యోగుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

    Bandi Sanjay

    ఇటీవల వెలువరించిన జీవో 317 విషయంలో ఉద్యోగుల్లో ఆందోళనలు పెరిగాయి. దీంతో జీవోను రద్దు చేయాల్సిందేననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవోను సవరించాలని సూచనలు పెరుగుతున్నాయి. ఉద్యోగుల భవిష్యత్ కు అడ్డుగా ఉన్న జీవోను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీంతో బండి సంజయ్ కూడా జీవో సవరణ గురించి డిమాండ్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.

    Also Read: కాంగ్రెస్ ను కట్టడి చేస్తున్న పార్టీలు.. ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డంకులు

    ఉద్యోగుల చర్యలతోనే తెలంగాణ కల సాకారమైంది. దీంతో వారి బాధలు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. సకల జనుల సమ్మె వల్లే తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించిందని తెలుస్తోంది. ఇవి తెలంగాణ సీఎంకు తెలియదా అని ప్రశ్నించారు. రాష్ర్టపతి ఉత్తర్వులు ఇచ్చి 41 నెలలు దాటినా ఉద్యోగులకు అడ్డు తగలడం ఎంతవరకు సమంజసం అనే అభిప్రాయాలు వస్తున్నాయి.

    ఉద్యోగుల విషయంలో కేసీఆర్ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఉాపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాడొద్దని హితవు చెబుతున్నారు. జీవో ను మార్చాల్సిందేనని గవర్నర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఇక కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉద్యోగుల సమస్యలు అర్థం చేసుకుని కేసీఆర్ సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు.

    Also Read: సంజయ్ పాదయాత్రకు అనుకోని అవాంతరాలు..

    Tags