అసైన్డ్ భూముల వ్యవహారంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బర్త్ రఫ్ కాబడ్డ మాజీ మంత్రి ఈటల రాజకీయ భవిష్యత్తుపై ఇంకా క్లారిటీ రానట్లే తెలుస్తోంది. కేసీఆర్ తాను బీసీ నాయకుడనే మంత్రి వర్గం నుంచి వెలివేశారని అంటున్న ఆయన సొంత పార్టీ పెడుతారా..?లేక ఇతర పార్టీల్లోకి చేరుతారా..? అన్న విషయం తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఈటల నియోజకవర్గమైన హూజూరాబాద్ నేతల్లో కొందరు టీఆర్ఎస్ ఈటల వైపు ఉంటున్నామని చెబుతున్నా.. మరి కొందరు మాత్రం టీఆర్ఎస్ తోనే ఉంటామని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మరోవైపు ఆయన తాజాగా బీజేపీ పెద్దలతో సమీక్ష చేసినట్లు సమాచారం.
మెదక్ ఉమ్మడి జిల్లాలో అసైన్డ్ భూములు ఆక్రమించారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఆరపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన కుమారుడిపై కూడా ఫిర్యాదు రావడంతో విచారణ జరిపారు. మరోవైపు ఈటల భవిష్యత్ రాజకీయ నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తనపై ఆరోపణలు వచ్చినా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయలేదు. దీంతో సీఎం ఆయనను ఆ కేబినేట్ నుంచి బర్తరఫ్ చేశారు. దీంతో ఆయన పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనా చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఇదిలా ఉండగానే కొన్ని రోజుల కిందట ఆయన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంతో ఆయన కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే కేవలం తెలంగాణ పరిస్థితుల గురించి మాత్రమే మాట్లాడమని ఈటల చెప్పారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మరో మంత్రి గంగుల కమలాకర్, ఈటల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ పెట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని అనుకున్నారు.
తాజాగా ఆయన బీజేపీ నేతలతో సమీక్ష జరిపారు. ఈ మీటింగ్ కు బీజేపీ అధిష్టాన లీడర్ భూపేందర్ యాదవ్ హాజరయ్యారు. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఉన్నారు. అయితే తనను పార్టీలో చేర్చుకుంటే బీసీ నేతగా పార్టీకి కూడా బలం పెరుగుతుందని చెప్పినట్లు సమాచారం. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి దుబ్బాక లాగా గెలిపించి కేసీఆర్ బుద్ధి చెప్పాలని అనుకున్నట్లు తెలిసింది. మరీ ఈ సమయంలో ఈటల ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.