బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది. ముందు చూపులేని నాయకత్వం చతికిలపడింది. ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటించకుండా ఎన్నికలకు పోయి చులకన అయ్యారు. ఢిల్లీ నాయకత్వం అంతా సర్వశక్తులు ఒడ్డినా చివరికి నిరాశే మిగిలింది. బలమైన నాయకత్వం లేకపోతే ఎంత బలవంతుడైనా అపజయం కాకతప్పదు అనే విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై అవగాహన, భౌగోళిక స్వరూపంపై పట్టు ఉన్న నాయకులే ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఓట్లు రాబడతామనుకుంటే పొరబడినట్లే. తుంగలో కాలేనిసట్లేనని తెలుస్తోంది. ఇటీవ జరిగిన అయిదు రాష్ర్టాల అసెంబ్లీ ఎ న్నికల్లో బీజేపీ రెండు రాష్ర్టాల్లో తప్ప మిగిలిన చోట్ల బోర్లాపడింది. బెంగాల్ అయితే అన్ని శక్తులు కలిపి పోరాడినా విజయతీరాలను అందుకోలేకపోయింది. దానిపై పో స్టుమార్టమ్ సైతం నిర్వహించింది. ఓటమికి గల కారణాలను అన్వేషించింది.
అసాం, పుదుచ్చేరిలో విజయం ఊహించినదే. కానీ బెంగాల్ లో మాత్రం విజయంపై ధీమా పెట్టుకున్నారు. ఎ లాగైనా దీదీని ఓడించి పగ్గాలు చేపడతామని పగటి కలలు కన్నారు. అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అంటూ పాడుకున్నారు. ఈశాన్య రాష్ర్టాల్లో పెద్ద రాష్ర్టమైన బెంగాల్ నుంచి పార్టీని గెలిపించాలని తపించారు. అధినేతలందరూ ప్రచారం చేసి బెంగాల్ లో ఇ విజయం తమదేనని ఘంటాపథంగా చెప్పారు. చివరికి ఫలితాలు తారుమారు కావడంతో ఖంగుతిన్నారు.
జనాకర్షణ లేన నాయకులతో బీజేపీ అపజయం మూటగట్టుకుంది. కీలక అంశాలను విస్మరించారు. పార్టీకి 18 మంది ఎంపీలున్నా పట్టుమని పదివేల మంది జనాన్ని కూడగట్టే సత్తా గల వారు లేకపోవడం గమనార్హం. సభలకు జనాన్ని సమీకరించే సామర్థ్యం ఒక్కరికీ లేదు. దీంతో పార్టీ చేదు అనుభవాల్ని చవిచూసింది. రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తా తారాకేశ్వర్ లో ఓడిపోయారు. లోక్ సభ సభ్యుడు నిషిత్ ప్రామాణిక్ మాత్రం దిన్ హటా సీటు నుంచి గెలిచి పరువు నిలబెట్టారు.
ముందస్తు ప్రణాళిక లేకుండా పోతే ఇలాగే ఉంటుంది. పార్టీ సీఎం అభ్యర్థి ఎవరనేది ముందే ప్రకటిస్తే బాుగుండేది. ఎవరి పనుల్లో వారుండి సీఎం ఎవరనే విషయంలో స్పష్టత లేకపోవడంతో ఓటర్లు పరేషాన్ అయ్యారు. ఎవరికి ఓటు వేయాలని ఆలోచించారు. సువెందు అధికారిని మమతా బెనర్జీపై పోటీ చేయించడంతో ఆమె ఓటమికే ప్రాధాన్యమిచ్చారు. ఓడించారు. కానీ అధికారం దక్కించుకోలేకపోయారు. ఫలితంగా పరాభవమే మిగిలింది. ఇక ఢిల్లీ నుంచి ప్రధాని, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ తదితర నేతల ప్రసంగాలు ప్రజల్ని రెచ్చగొట్టేలా ఉండడంతో వారు సరైన అవగాహనకు రాలేకపోయారు.