ట్విట్టర్, ఫేస్‌బుక్‌, వాట్సాప్ నిషేధం దిశగా కేంద్రం?

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ట్విట్టర్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్‌లు కొత్తగా జారీ చేసిన మధ్యవర్తిత్వ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైనందున భారత ప్రభుత్వం నిషేధాన్ని విధించేందుకు రెడీ అయినట్టుగా సమాచారం. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొన్ని మార్గదర్శకాలు ఇవి పాటించడం లేదని తేలింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు భారతదేశంలో రివ్యూలకు అధికారులను నియమించాల్సి ఉంది. కానీ అవి పెడచెవిన పెట్టడంతో నిషేధం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా […]

Written By: NARESH, Updated On : May 25, 2021 9:39 pm
Follow us on

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ట్విట్టర్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్‌లు కొత్తగా జారీ చేసిన మధ్యవర్తిత్వ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైనందున భారత ప్రభుత్వం నిషేధాన్ని విధించేందుకు రెడీ అయినట్టుగా సమాచారం. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొన్ని మార్గదర్శకాలు ఇవి పాటించడం లేదని తేలింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు భారతదేశంలో రివ్యూలకు అధికారులను నియమించాల్సి ఉంది. కానీ అవి పెడచెవిన పెట్టడంతో నిషేధం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటిదాకా ఫేస్బుక్ మరియు ట్విట్టర్ వంటి టెక్ దిగ్గజాలు ఇంకా ఆ మార్గదర్శకాలను పాటించలేదు. గడువు ఈ రోజుతో ముగుస్తుంది. కాబట్టి రేపటి నుంచి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలకు దూరం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ ఫ్లాట్ ఫాంలు అధికారులను నియమించలేదు. కేంద్రం ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. కంటెంట్‌ను పర్యవేక్షించడం లేదు. అభ్యంతరకరంగా ఉంటే దాన్ని తొలగించాల్సి ఉంది.

ఈ మార్గదర్శకాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫారంలకు వర్తిస్తాయి. అమెజాన్ ప్రైమ్ మరియు నెట్‌ఫ్లిక్స్ సహా అన్ని ఓటీటీ ప్లాట్‌ఫారంలు భారతదేశంలో ఉన్న ఒక ఫిర్యాదుల పరిష్కార అధికారిని నియమించవలసి ఉంటుంది, వారు ఫిర్యాదులను జాగ్రత్తగా చూసుకుంటారు. 15 రోజుల్లో వాటిపై చర్య తీసుకుంటారు.

ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలు మరియు ఓటీటీలకు స్వీయ నియంత్రణ విధానం లేదని భారత ప్రభుత్వం అభిప్రాయపడింది. అందువల్ల, కంపెనీలు వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులను నియమించాలని.. కంటెంట్‌ను నియంత్రించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం కోరుతోంది. అయితే నియమించకపోవడంతో ఉల్లంఘన ఫిర్యాదులపై చర్యలు తీసుకునే ఏకైక అధికారం కమిటీకి ఉంటుందని కొత్త నిబంధనలలో పేర్కొన్నారు. దీంతో కేంద్రం ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ నిషేధం దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.