
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ఏడేళ్లు అవుతోంది. ఈ కాంలో ఆయన సాధించేందేమిటి? ఏమీ లేదనే సమాధానం వస్తుంది. కనీసం పార్టీని గాడిలో పెట్టారా అంటే అదీ లేదు. 175 నియోజకవర్గాలకు ఇన్ చార్జులను కూడా నియమించలేకపోయారు. దీంతో జనసేన పార్టీ మనుగడపై అందరికీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పటికీ ఎవరికో ఒకరికి మద్దతు తెలుపుతూ పబ్బం గడుపుకోవడం తప్ప చర్యలు శూన్యమని తెలుస్తోంది.
పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. పార్టీ ఆవిర్భవించి ఏడేళ్లు పూర్తయినా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టింది లేదు. క్షేత్రస్థాయిలో బలంగా ఉంటేనే ఎన్నికల్లో విజయం లభిస్తుంది. అయితే ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ ఎలాంటి సమస్యలపై ఉద్యమం సైతం తీసుకురాలేదు. దీంతో ప్రజలకు జనసేన పార్టీపై విశ్వాసం పోతున్నట్లుగా ఉంది.
పార్టీకి ఇప్పటివరకు ఇన్ నార్జిలను కూడా నియమించలేదు. రాష్ర్టంలో 175 నియోజకవర్గాల్లో నమ్మదగిన కార్యకర్తలే అందుబాటులో లేరు. ఏదైనా పార్టీ కార్యక్రమాలు చేపడితే అభిమానులే అన్ని చూసుకుంటున్నారు. అయితే ఇన్ చార్జిలను నియమించడంలో పవన్ కల్యాణ్ ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదని పార్టీ కార్యకర్తలే పేర్కొంటున్నారు.
ఎవరికి ఇన్ చార్జి పదవి ఇచ్చినా వారితో తలెత్తే ఇబ్బందులను పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ భావించడంతోనే ఇన్ చార్జిలను నియమించలేదు. మరో వైపు బీజేపీతో పొత్తు నడుస్తూనే ఉంది. భవిష్యత్ లో టీడీపీతో కలిసే అవకాశాలు ఉన్నాయనే తెలుస్తోంది. జనసేనకు ఇన్ చార్జిలు లేనందువల్ల రెండు జిల్లాలకు పరిమితమవుతున్నట్లు విమర్శలున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో పార్టీకి పునాదులే లేవు. ఇంత జరుగుతున్నా పవన్ కల్యాణ్ మాత్రం పట్టించుకోవడం లేదు.