spot_img
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్, పాలస్తీనా వివాదానికి కారణాలేంటి?

ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదానికి కారణాలేంటి?

Israeli-Palestinian warఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య రాజకీయ దుమారం రేగుతోంి. చిలికి చిలికి గాలి వానలా మారింది. ఇరు దేశాల మధ్య ఆధిపత్య పోరు చెలరేగింది. జోర్డాన్ 1948లో ఇజ్రాయెల్ తో జరిగిన యుద్ధం తరువాత షేక్ జరా ప్రాంతంలో పాలస్తీనా శరణార్థి కుటుంబాలకు ఐక్యరాజ్య సమితి సహకారంతో నివాస ప్రాంతాలను నిర్మించింది. కానీ 1967లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. 1876లో ఒట్టొమాన్ చక్రవర్తి పరిపాలన కాలంలోనే షేక్జరాలో అరబ్ ల నుంచి కొనుగోలు చేసిన స్థలాల్లో జోర్డాన్ పాలస్తీనా శరణార్థులకు ఇళ్లు నిర్మించిందంటూ యూదులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో మేలో దీనిపై తీర్పు వెలువడాల్సి ఉండడంతో ఉద్రిక్తలు ఎక్కువయ్యాయి. న్యాయస్థానం మరో ముప్పై రోజుల పాటు తీర్పు వాయిదా వేసింది.

ఎవరి ప్రయత్నాల్లో వారు
ఇజ్రాయెల్లో నెతన్యాహు బలహీనపడిన రెండేళ్లుగా ఏ పార్టీకి ఆధిపత్యం దక్కలేదు. మార్చిలో జరిగిన ఎన్నికల్లోనూ ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో ఇజ్రాయెల్ లో రెండేళ్లలో ఐదో సారి ఎన్నికలకు వెళ్తున్నారు. ఈనేపథ్యంలో తన బలం పెంచుకోవాలని నెతన్యాహు భావిస్తున్నాడు. పాలస్తీనా చట్ట సభలకు ఈనెల 30న జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నారు. దీంతో ఎలాగైనా ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహించాలని టర్కీ భావిస్తోంది. ఇటీవల జరిగిన ఇస్లామిక్ దేశాల సమావేశంలో పాలస్తీా కోసం సమష్టిగా రక్షణ దళం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది.

తటస్థంగా భారత్
ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా చైనా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకుంది. ఇజ్రాయెల్, ప ాలలస్తీనా చర్చల్లో నిర్మాణాత్మక పాత్ర ప ోషించేందుకు డ్రాగన్ సిద్ధంగా ఉంది. భారత్ మాత్ర్ం ఈ వ్యవహారంలో తటస్థంగా ఉండిపోయింది. ఇటు ఇజ్రాయెల్, పాలస్తీనాలకు ఎవరికీ మద్దతు తెలపకుండా మధ్యస్తంగా ఉంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES
spot_img

Most Popular