https://oktelugu.com/

‘ఆచార్య’ పోరంబోకు పాత్రలో ఫేమస్ రైటర్ !

సినిమా రైటర్స్ అందరూ దర్శకులు అయిపోతుంటే.. రచయిత, దర్శకుడు బివిఎస్ రవి మాత్రం నటుడిగా సెటిల్ అవ్వడానికి కిందామీదా పడుతున్నాడు. మిత్రుడు కొరటాల శివ సహకారంతో ఎలాగోలా ఇండస్ట్రీలో నెట్టుకొస్తున్న ఈ ఫేడ్ అవుట్ రైటర్, తాజాగా ఆచార్య సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. విలన్స్ వైపు ఉండి, వారి తొత్తుగా అడ్డమైన పనులు చేసే పోరంబోకు పాత్రలో రవి అలరించబోతున్నాడు. అయితే, ఇప్పటికే రవి, తన మిత్రుడు గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన క్రాక్ […]

Written By: , Updated On : June 4, 2021 / 11:56 AM IST
Follow us on

సినిమా రైటర్స్ అందరూ దర్శకులు అయిపోతుంటే.. రచయిత, దర్శకుడు బివిఎస్ రవి మాత్రం నటుడిగా సెటిల్ అవ్వడానికి కిందామీదా పడుతున్నాడు. మిత్రుడు కొరటాల శివ సహకారంతో ఎలాగోలా ఇండస్ట్రీలో నెట్టుకొస్తున్న ఈ ఫేడ్ అవుట్ రైటర్, తాజాగా ఆచార్య సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. విలన్స్ వైపు ఉండి, వారి తొత్తుగా అడ్డమైన పనులు చేసే పోరంబోకు పాత్రలో రవి అలరించబోతున్నాడు.

అయితే, ఇప్పటికే రవి, తన మిత్రుడు గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన క్రాక్ సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో కనిపించి బాగానే ఆకట్టుకున్నాడు. క్రాక్ లో రెండు మూడు సీన్లు వుండే పాత్ర అయినప్పటికీ, చాల బాగా నటించాడు. ఊళ్లలో పాన్ డబ్బాల దగ్గర కూర్చుని పిచ్చాపాటీ కబుర్లు చెబుతూ వచ్చి పోయే జనాలను వెక్కిరించే ఆ పాత్రకు రవి బాగా సూట్ అయ్యాడు.

ఇప్పుడు ‘ఆచార్య’ సినిమాలో చేస్తోన్న పాత్ర కూడా రవికి బాగా సూట్ అవుతుందట. ఆచార్యలో రవి పాత్ర షూటింగ్ పూర్తయిపోయిందని, తాజాగా ఎడిటింగ్ కూడా చేసి చూసారని.. రవి పాత్రలో మంచి ఫన్ జనరేట్ అవుతుందని తెలుస్తోంది. బివిఎస్ రవికి మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సీన్స్ పడ్డాయట. గతంలో నాయక్ సినిమాలో పోసానికి నటుడిగా ఎంత మంచి పేరు వచ్చిందో..

ఇప్పుడు రవికి కూడా అలాంటి మంచి పేరే రాబోతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా నటుడిగా అవతారం ఎత్తుతున్న రవి ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ఇప్పటివరకూ ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లకు కథల్లో సపోర్ట్ చేస్తూ.. కెరీర్ ను లాక్కోస్తున్నాడు. మధ్యమధ్యలో కథలు సమకూరుస్తూ బిజీగా వుండే బివిఎస్ రవి, నటుడిగా కూడా బిజీ అయితే, ఇక రైటింగ్ కి స్వస్తి చెబుతాడేమో.