జాతీయ వార్తలుఈట‌ల వ్యూహం అదేనా?

ఈట‌ల వ్యూహం అదేనా?

Etela Rajender
రెండు రోజుల కింద‌టి వ‌ర‌కూ వైద్యారోగ్య శాఖ మంత్రిగా కొవిడ్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో త‌ల‌మున‌క‌లై ఉన్నారు ఈట‌ల రాజేంద‌ర్‌. కానీ.. ఊహించ‌ని ప‌రిణామాల‌తో నేడు మాజీ మంత్రి అయ్యారు. బ‌హుశా ఇంత త్వ‌ర‌గా ఈ ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఆయ‌న కూడా ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. మొత్తానికి టీఆర్ఎస్ అధిష్ఠానం ఆయ‌న్ను మాజీని చేసింది. మ‌రి, ఇప్పుడు ఆయ‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఏంట‌న్న‌దే చ‌ర్చ‌.

బీజేపీ లేదా ఇత‌ర పార్టీలోకి ఈట‌ల చేరిపోయే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు విశ్లేష‌ణ‌లు చేశారు. కానీ.. ఆయ‌న మ‌న‌సులో వేరే ఆలోచన ఉంద‌ని మ‌రికొంద‌రు భావిస్తున్నారు. నిజానికి టీఆర్ఎస్ అధిష్టానంతో ఈట‌ల వైరం ఈ నాటిది కాదు. మొద‌టి ద‌ఫా ప్ర‌భుత్వంలోనే రాజుకున్న‌ట్టు స‌మాచారం. అది చినికి చినికి గాలివాన‌గా మార‌డానికి ఇంత స‌మ‌యం ప‌ట్టింది.

కొంత కాలంగా ఈట‌ల మాట‌ల్లో ఈ విష‌యం స్ప‌ష్టంగా క‌నిపించింది. కేసీఆర్ తో తాను ఢీకొంటున్నాన‌న్న విష‌యం త‌న ప్ర‌సంగాల్లో ప‌రోక్షంగానే వినిపించారు. ఈ ప‌ద‌వులు ఇవాళ ఉండొచ్చు.. పోవ‌చ్చు.. అంటూ ప‌లు మార్లు మాట్లాడారు. అయితే.. ఇలాంటి రోజు ఒక‌టి వ‌స్తుంద‌ని ముందుగానే ఊహించిన ఈట‌ల‌.. దానికి అనుగుణంగా ప్రిప‌రేష‌న్లో ఉన్న‌ట్టు స‌మాచారం.

దాని ప్ర‌కారం.. ఈట‌ల ఇత‌ర పార్టీల్లోకి వెళ్ల‌కుండా.. సొంత పార్టీ పెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యం తెలిసిన త‌ర్వాత‌నే.. కేసీఆర్ ఆ మ‌ధ్య సెటైర్లు వేసిన‌ట్టు స‌మాచారం. పార్టీ పెట్ట‌డం అంటే అంత ఈజీకాదంటూ టీఆర్ఎస్ ముఖ్యుల స‌మావేశంలో మాట్లాడారు. ఈ విష‌యాల‌న్నీ క్రోడీక‌రిస్తున్న విశ్లేష‌కులు ఈట‌ల సొంత పార్టీ పెట్టే అవ‌కాశం కూడా ఉంద‌ని అంటున్నారు. ఈట‌ల భ‌విష్య‌త్ వ్యూహం ఇదేన‌ని చెబుతున్నారు. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Etela Bandi Meeting: ఈటల, బండి అలయ్ బలయ్: కార్యకర్తలు ఏం తెలుసుకోవాలంటే..

Etela Bandi Meeting: రాజకీయ నాయకులు రాజకీయాలు మాత్రమే చేస్తారు. వాళ్లకు అనుకూలమైన పనులు మాత్రమే చేస్తారు. అంటే తప్ప కార్యకర్తల అభీష్టానికి నడుచుకోరు. రాజకీయాలు అంటే సేవ కాదు. అది ఒక...

Modi Cabinet Expansion: మోడీ కొత్త టీం.. తెలుగు రాష్ట్రాల నుంచి వారికే ఛాన్స్!

Modi Cabinet Expansion: కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ప్రారంభం అయింది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. అందుకే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...
Exit mobile version