AP Employees: ఏపీలో( Andhra Pradesh) ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. గత అనుభవాల దృష్ట్యా ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. గత ప్రభుత్వం ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. మరోసారి ఆ పరిస్థితి రాకుండా చూడాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి.. వీలైనంతవరకూ సమస్యలు పరిష్కరించి.. దీపావళి కానుకగా ప్రకటించాలని భావిస్తోంది. ఈరోజు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ అంశాలు ఒక ఉలిక్కి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.
* ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం..
ప్రధానంగా ఉద్యోగులు సహా ఇతర ఆర్థిక అంశాలపై పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో 14 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ సమావేశం జరగనుంది. ఈరోజు సచివాలయంలో మంత్రులు పయ్యావుల కేశవ్,నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ చర్చిస్తారు. ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికపరమైన డిమాండ్లపై సీఎం చంద్రబాబు, సిఎస్ ఇప్పటికే సమీక్షించారు. ఉద్యోగుల పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం కనుగొనాలని సూచించారు. ఉద్యోగుల బకాయిల వివరాలపై ఆర్థిక శాఖ సీఎం చంద్రబాబుకు నివేదిక కూడా ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి పై వివరించింది. కొత్త జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయంపై అంచనా వేయడానికి మరికొంత సమయం పట్టి అవకాశం ఉంది.
* సీఎం ప్రకటన?
ప్రధానంగా ఉద్యోగుల డిఏలు బకాయిలు ఉండగా.. పిఆర్సి పై కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న డిఎల్లో ఒకటి విడుదల చేయాలన్న 164 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు. ఒక్కడిఏ బకాయి తో పాటు మరో అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ఎంత ఖర్చు అవుతుందన్న దానిపై ఈరోజు క్లారిటీ రానుంది. అయితే మంత్రుల కమిటీతో సమావేశం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు దీపావళి కానుకగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇది నిజంగా ఏపీలో ఉద్యోగులకు ఉపశమనమే.