సోము వీర్రాజు గేమ్ ప్లాన్ ఏమిటీ?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు ప్రత్యామ్మాయంగా గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను కలిసి కాపులను ఒక్కటే చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతకీ సోము వీర్రాజు గేమ్ ప్లాన్ ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారనేది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. Also Read: విశాఖ వాసులకి కేంద్రం అద్దిరిపోయే న్యూస్..! ఏపీలో మూడో ప్రత్యామ్మాయంగా ఎదగాలని సోము వీర్రాజు […]

Written By: NARESH, Updated On : August 16, 2020 4:10 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు ప్రత్యామ్మాయంగా గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను కలిసి కాపులను ఒక్కటే చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతకీ సోము వీర్రాజు గేమ్ ప్లాన్ ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారనేది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Also Read: విశాఖ వాసులకి కేంద్రం అద్దిరిపోయే న్యూస్..!

ఏపీలో మూడో ప్రత్యామ్మాయంగా ఎదగాలని సోము వీర్రాజు ప్లాన్ చేస్తున్నారు. అయితే టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం సోము వీర్రాజును వైసీపీకి అనుకూలమైన వ్యక్తిగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. కొద్దిరోజులుగా ఇదంతా వ్యూహాత్మకంగా సాగుతోంది. టీడీపీ ఆరోపిస్తున్నట్టు తాను వైసీపీకి ఫేవర్ గా రాజకీయాలు చేయడం లేదని చూపించే ప్రయత్నాలు సోము వీర్రాజు చేస్తున్నారా? ఏ పార్టీకి మద్దతుగా లేకుండా సొంతంగా బీజేపీని నిలబెట్టాలని యోచిస్తున్నాడా? టీడీపీతోపాటు వైసీపీపై దాడి చేయగలనని చూపించడానికి ప్రయత్నిస్తున్నాడా అంటే ఔననే అంటున్నాయి బీజేపీ రాజకీయవర్గాలు..

ఇప్పటికే వైసీపీకి, టీడీపీకి ఫేవర్ గా రాజకీయాలు చేస్తున్న కొందరిని సస్పెండ్ చేసి సోమువీర్రాజు పార్టీ శ్రేణులకు స్పష్టమైన హెచ్చరికలు పంపారు. ఆ రెండు పార్టీలకు దూరంగా ఉండాలని దిశానిర్ధేశం చేశారు. తాను రెండు పార్టీల నుంచి సమాన దూరం ఉంచుతానని ఈ చర్యల ద్వారా నిరూపించాడు.

Also Read: తహసీల్దార్ కోటి లంచంలో రేవంత్ రెడ్డికి లింక్?

తాజాగా 2018లో గుంటూరు పోలీసులపై ఒక వర్గం వారు దాడిచేస్తే ఆ కేసును వైసీపీ ప్రభుత్వం ఎత్తివేయడాన్ని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇక అయోధ్య భూమిపూజను ప్రసారం చేయని ఎస్వీబీసీ చానెల్ పై కామెంట్ చేసిన బీజేపీ నాయకురాలు సాధినేని యామినిపై కేసు నమోదు చేసినందుకు వైసీపీ ప్రభుత్వంపై వీర్రాజు నిప్పులు చెరిగారు.

దీంతో వైసీపీకి ఫేవర్ గా రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలకు ఈ రెండు ఉదంతాలతో సోము వీర్రాజు చెక్ చెప్పారు. తాను టీడీపీ, వైసీపీ రెండింటిని వ్యతిరేకిస్తున్నానని.. తటస్థ నాయకుడిని అని నిరూపించుకున్నారు. ఏపీలో మూడో ప్రత్యామ్మాయంగా బీజేపీని ఉంచాలని సోము వీర్రాజు కోరుకుంటున్నారు. మరి ఇతడు విజయం సాధిస్తాడో లేదో చూడాలి.