https://oktelugu.com/

అక్కినేని కాంపౌండ్ లో నలిగిపోతున్న డైరెక్టర్ !

యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దాదాపు రెండు సంవత్సరాలకు పైగా అక్కినేని కాంపౌండ్ లో నలిగిపోతున్నాడు. సహజంగా నాగ్ ను స్క్రిప్ట్ విషయంలో ఒప్పించడం కొంచెం కష్టమే. దీనికి తోడు, నాగ్ ఇతర పనులతో ఎప్పటికప్పుడు బిజీగా ఉంటూ.. కళ్యాణ్ కృష్ణను మాత్రం స్క్రిప్ట్ పనులను తప్ప, మరో పనిని చేయనివ్వట్లేదు. ఎన్ని నెలలు చేసినా అదే పేమెంట్.. దానితో కళ్యాణ్ కృష్ణ కాస్త లోలోపల ఇబ్బంది పడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కళ్యాణ్ కృష్ణకి ఈ […]

Written By:
  • admin
  • , Updated On : August 16, 2020 / 03:59 PM IST
    Follow us on


    యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దాదాపు రెండు సంవత్సరాలకు పైగా అక్కినేని కాంపౌండ్ లో నలిగిపోతున్నాడు. సహజంగా నాగ్ ను స్క్రిప్ట్ విషయంలో ఒప్పించడం కొంచెం కష్టమే. దీనికి తోడు, నాగ్ ఇతర పనులతో ఎప్పటికప్పుడు బిజీగా ఉంటూ.. కళ్యాణ్ కృష్ణను మాత్రం స్క్రిప్ట్ పనులను తప్ప, మరో పనిని చేయనివ్వట్లేదు. ఎన్ని నెలలు చేసినా అదే పేమెంట్.. దానితో కళ్యాణ్ కృష్ణ కాస్త లోలోపల ఇబ్బంది పడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కళ్యాణ్ కృష్ణకి ఈ గతి పట్టడానికి కారణం రవితేజతో చేసిన ‘నేల టికెట్’ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడమే.

    Also Read: ఆర్థిక కష్టాల్లో స్టార్ హీరో వారసుడు !

    ఒకవేళ ఆ సినిమా హిట్ అయి ఉంటే.. కళ్యాణ్ కృష్ణకి గ్యాప్ రాకుండా అక్కినేని హీరోల్లో ఎవరో ఒకరు డేట్స్ ఇచ్చేవాళ్ళు. సరే అయిపోయిందేదో అయిపొయింది. కనీసం కరోనా అనంతరం కూడా ఈ సినిమా మొదలయ్యేలా కనబడటం లేదట. మొత్తానికి రెండేళ్లు నుండి అక్కినేని కాంపౌండ్‌ నుండి బయటకు రాలేక, సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్లలేక కళ్యాణ్ కృష్ణ పడుతున్న బాధ వర్ణాతీతం. అసలు కళ్యాణ్ ఈ సినిమా నుండి ఎప్పుడు బయటకు వస్తాడో అని సినీ సర్కిల్స్ లోని ఆయన ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోతున్నారట. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ కోసం నాగ్‌ బిజీగా ఉన్నాడు.

    Also Read: అందాలను ఆరబోసిన శ్రద్ధా దాస్

    మరి నాగార్జున బంగార్రాజు మీదకు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా ఇలా వాయిదా పడుతూనే వస్తోంది. అనుకున్న సమయానికి బంగార్రాజు స్టార్ట్ కాలేక ప్రతిసారి చేతులు ఎత్తేస్తున్నాడు. అయితే అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేసి… అన్ని కుదిరితే వచ్చే సంక్రాంతికి బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని కళ్యాణ్ కృష్ణ ప్లాన్ చేసుకున్నప్పటికీ.. నాగ్ మాత్రం సైలెంట్ గా బిగ్ బాస్ కి తన డేట్స్ మొత్తం ఇచ్చి.. మళ్ళీ బంగార్రాజును వెనక్కి నెట్టేశాడు. పాపం కళ్యాణ్ కృష్ణ.