ఆ విషయంలో జగన్‌ ఏం చేయబోతున్నారు!

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో సీఐడీ దాఖలు చేసిన కేసుల్లో విచారణ జరిపిన హైకోర్టు మొత్తంగా 85 పేజీల తీర్పు ఇచ్చింది. భూములు కొనుగోలు చేయటం.. భారత పౌరుడి రాజ్యాంగ, న్యాయపరమైన హక్కు . అమ్మకం దారులు భూముల్ని ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా అమ్ముకున్నారు.. ఈ అమ్మకాల్లో రిజిస్టర్డ్, సేల్ డీడ్స్ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో.. ప్రైవేట్ వ్యక్తుల మధ్య లావాదేవీలు క్రిమినల్ నేరాల కిందకు రావు. వారిని ప్రాసిక్యూట్ చేసే అధికారం ఎవరికీ లేదు అని హైకోర్టు […]

Written By: Srinivas, Updated On : January 20, 2021 11:37 am
Follow us on


అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో సీఐడీ దాఖలు చేసిన కేసుల్లో విచారణ జరిపిన హైకోర్టు మొత్తంగా 85 పేజీల తీర్పు ఇచ్చింది. భూములు కొనుగోలు చేయటం.. భారత పౌరుడి రాజ్యాంగ, న్యాయపరమైన హక్కు . అమ్మకం దారులు భూముల్ని ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా అమ్ముకున్నారు.. ఈ అమ్మకాల్లో రిజిస్టర్డ్, సేల్ డీడ్స్ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో.. ప్రైవేట్ వ్యక్తుల మధ్య లావాదేవీలు క్రిమినల్ నేరాల కిందకు రావు. వారిని ప్రాసిక్యూట్ చేసే అధికారం ఎవరికీ లేదు అని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

Also Read: పోలవరం ప్రాజెక్టుపై నేడు ఉన్నతస్థాయి సమావేశం

ఇక ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనేది స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీ కొనుగోలు, అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడితే మోపే నేరం, ఇన్‌సైడర్ ట్రేడింగ్ కింద జరిగే నేరాలకు ఐపీసీలోని సెక్షన్లను వర్తింపచేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఐపీసీలోని సెక్షన్ 420తో సహా ఏ సెక్షన్ కింద అయినా ఇన్‌సైడర్ ట్రేడింగ్ కింద నేరంగా పరిగణించలేమని.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది ఐపీసీకి కొత్త పదమని స్పష్టం చేసింది. 420, 406, 409, 120బి సెక్షన్ల కింద కేసులు మోపడం.. న్యాయ సమ్మతం కాదు. అందుకే ఎఫ్ఐఆర్‌ కొట్టివేస్తున్నామని స్పష్టంగా చెప్పింది.

రాజధాని ఎక్కడ వస్తుందో ప్రముఖ పత్రికల్లో ముందే వచ్చిందని.. సీఎం తన ప్రమాణ స్వీకారం తర్వాత విజయవాడ, గుంటూరు మధ్య.. రాజధాని వస్తుందని ప్రకటించారని ధర్మాసనం తీర్పులో గుర్తు చేసింది. భూములమ్మేవారికి, కొనుగోలు చేసేవారికి.. రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసని.. ఇందులో కుట్ర కోణం ఉందని ఎలా చెబుతామని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులను అనుమతిస్తే భవిష్యత్‌లో భూమి అమ్మిన వారంతా ధర పెరిగిన వెంటనే కొనుగోలుదారులపై కేసులు పెడతారని ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read: ఆ ప్రచారం ప్రజల దాక చేరితే టీడీపీ నష్టమే..!

ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అధికార పార్టీకి కొత్తగా అనేక సమస్యలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందు ముందు జరిగే పరిణామాలు కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. బహుశా.. సీబీఐతో విచారణ జరిపించేందుకు తమ పలుకుబడి అంతా ఉపయోగించే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్