సిమెంట్‌ కంపెనీలకు ప్రభుత్వ మద్దతు..: నిజమే అంటారా!

భారతీ సిమెంట్స్‌.. అది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సిమెంట్‌ కంపెనీయే. అందరికీ తెలిసిన విషయమే కూడా. ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌. అలాంటప్పుడు అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఏ కంపెనీ సిమెంట్‌ వాడుతారు అంటే.. ఆటోమెటిక్‌గా వచ్చే సమాధానం భారతీ సిమెంట్‌ అనే. అంతెందుకు అధికారిక రికార్డులు సైతం అదే చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంటున్న సిమెంట్‌లో అత్యధిక భాగం భారతి సిమెంట్‌ నుంచేనని. ఆ తర్వాత కొనుగోళ్లు చేసేది ఇండియా సిమెంట్స్ నుంచి. ఇది […]

Written By: Srinivas, Updated On : January 20, 2021 11:28 am
Follow us on


భారతీ సిమెంట్స్‌.. అది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సిమెంట్‌ కంపెనీయే. అందరికీ తెలిసిన విషయమే కూడా. ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌. అలాంటప్పుడు అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఏ కంపెనీ సిమెంట్‌ వాడుతారు అంటే.. ఆటోమెటిక్‌గా వచ్చే సమాధానం భారతీ సిమెంట్‌ అనే. అంతెందుకు అధికారిక రికార్డులు సైతం అదే చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంటున్న సిమెంట్‌లో అత్యధిక భాగం భారతి సిమెంట్‌ నుంచేనని. ఆ తర్వాత కొనుగోళ్లు చేసేది ఇండియా సిమెంట్స్ నుంచి. ఇది ఎవరిదో తెలుసా..! జగన్ అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితుడు.. ఇప్పటికీ వారం వారం కోర్టు చుట్టూ తిరిగే శ్రీనివాసన్ కు చెందిన కంపెనీ.

Also Read: పోలవరం ప్రాజెక్టుపై నేడు ఉన్నతస్థాయి సమావేశం

జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన చరిత్ర ఆయనకు ఉంది. ఎనిమిది నెలల కాలంలోనే ప్రభుత్వం భారతి సిమెంట్స్ నుంచి 2 లక్షల 28 వేల 370 మెట్రిక్‌ టన్నుల సిమెంట్ కొనుగోలు చేసింది. ఇది మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేసిన సిమెంట్‌లో 14 శాతం. తర్వాత అక్రమాస్తుల కేసులో సహ నిందితుడైన శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్ నుంచి లక్షా యాభై తొమ్మిది వేలకుపైగా మెట్రిక్ టన్నులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే ఈ రెండు కంపెనీలకే 30 శాతం ప్రభుత్వ కొనుగోలు వాటా దక్కింది.

అయితే.. ప్రభుత్వానికి సిమెంట్ కంపెనీలు రూ.225కే సరఫరా చేయాలనే నిబంధన పెట్టింది. కానీ.. ధరల విషయంలో పట్టించుకోమనే ఓ అప్రకటిత నిబంధన అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సిమెంట్ కంపెనీలన్నీ సిండికేట్ అయిపోయి మార్కెట్‌లో కొరత సృష్టిస్తున్నాయి. ఫలితంగా సిమెంట్ బస్తా నాలుగు వందలకు చేరిందని కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ.. ప్రభుత్వాలు మాత్రం కల్పించుకోవడం లేదు. గతంలో ఇలా పెరిగినప్పుడు ప్రభుత్వాలు హెచ్చరికలు చేసేవి. అయితే.. ఇప్పుడు ప్రభుత్వాల మద్దతుతోనే సిమెంట్‌ కంపెనీలు తమకు నచ్చినట్లుగా ఆడుతున్నాయి.

Also Read: ఆ ప్రచారం ప్రజల దాక చేరితే టీడీపీ నష్టమే..!

భారతీ సిమెంట్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన వికాట్ కు వాటా ఉంది. ప్రస్తుతం ధరల పెరుగుదల వల్ల.. ఒక్క ఏడాదిలో భారతీ సిమెంట్స్‌కు రూ.వెయ్యి కోట్ల అదనపు లాభం వస్తుందని.. ఆ కంపెనీ తన నివేదికలో పేర్కొంది. దీన్నే తెలుగుదేశం పార్టీ హైలెట్ చేస్తోంది. సిమెంట్ కంపెనీల ధరల పెరుగుదల వెనుక జగన్ స్వార్థం కూడా ఉందని ఆరోపిస్తోంది. మొత్తంగా చూస్తే ప్రతిపక్ష టీడీపీకి ఇది కూడా ఒక ప్రధానం అంశంగా దొరికినట్లుగా అనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్