అక్కడ ఎన్నికలు పెడుదామన్నా ఉద్యోగులు లేరు..!

ఏపీలో ఎస్‌ఈసీ వర్సెస్‌ ప్రభుత్వం మధ్య యుద్ధం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇప్పుడు ఎస్‌ఈసీ జగన్‌ ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో ఎస్‌ఈసీలో పనిచేయడానికి ఏ అధికారి అయినా ఒప్పుకుంటాడా..? తెలిసి తెలిసి పులి నోట్లో తల పెడతాడా..? అక్కడ పని చేయడానికి సిద్ధంగా ఉంటారా..? Also Read: ఆ విషయంలో జగన్‌ ఏం చేయబోతున్నారు! ఎస్‌ఈసీ ఏం చేసినా ప్రభుత్వానికి నచ్చదు. ఎన్నికలు నిర్వహించడానికి ఎస్‌ఈసీ సిద్ధమయ్యారు. అలాంటప్పుడు […]

Written By: Srinivas, Updated On : January 20, 2021 12:03 pm
Follow us on


ఏపీలో ఎస్‌ఈసీ వర్సెస్‌ ప్రభుత్వం మధ్య యుద్ధం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇప్పుడు ఎస్‌ఈసీ జగన్‌ ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో ఎస్‌ఈసీలో పనిచేయడానికి ఏ అధికారి అయినా ఒప్పుకుంటాడా..? తెలిసి తెలిసి పులి నోట్లో తల పెడతాడా..? అక్కడ పని చేయడానికి సిద్ధంగా ఉంటారా..?

Also Read: ఆ విషయంలో జగన్‌ ఏం చేయబోతున్నారు!

ఎస్‌ఈసీ ఏం చేసినా ప్రభుత్వానికి నచ్చదు. ఎన్నికలు నిర్వహించడానికి ఎస్‌ఈసీ సిద్ధమయ్యారు. అలాంటప్పుడు అక్కడ పని చేసే ఉద్యోగులు ఆయన చెప్పినట్లుగా చేయాల్సిందే. లేకపోతే.. వేటు పడిపోతుంది. జాయింట్ డైరెక్టర్ సాయిప్రసాద్ అలాగే ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. సెక్రటరీని వెనక్కి పంపేశారు. కొంత మంది ఉద్యోగులు ముందే సెలువు పెట్టారు. దీంతో ఉద్యోగుల అవసరం పడింది. ఎస్‌ఈసీ మేరకు ఉద్యోగుల్ని పంపాలని సీఎస్‌కు లేఖ రాశారు. సీఎం కొంత మంది ఉద్యోగుల్ని ఎంపిక చేసి.. సెలక్షన్ ప్రక్రియలో పాల్గొనాలని ఆదేశించారు. కానీ జరుగుతున్నదంతా చూసిన తర్వాత ఎవరైనా వెళ్తారా..?

ఉద్యోగులు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా.. ఉద్యోగ సంఘాలు మాత్రం ఇందుకు ఒప్పుకుంటాయన్న నమ్మకం లేదు. ముఖ్యంగా ఉద్యోగుల ప్రయోజనాల కన్నా.. ప్రభుత్వాన్ని కాపాడే విషయంలో సామాజిక బాధ్యత ఉందని తెగ తాపత్రయపడిపోయే సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి లాంటి వాళ్లు అసలు ఒప్పుకోరు. అందుకే ఆయన నేరుగా సీఎస్‌ను కలిసి.. అసలు ఉద్యోగులెవరూ ఎస్‌ఈసీ దగ్గర పని చేయడానికి సిద్ధంగా లేరని.. ఎవరినీ డిప్యుటేషన్ పై పంపించొద్దంటూ తేల్చేశారు. తమకు ప్రమోషన్లు వచ్చే సమయం వచ్చిందని.. తాము పోలేమని సెలక్షన్ ప్రాసెస్‌లో ఉన్న ఉద్యోగులతోనూ లెటర్లు ఇప్పించారు. అంటే ఇప్పుడు ఎస్‌ఈసీకి ఎన్నికలు నిర్వహించడానికి ఉద్యోగుల సపోర్టు కూడా లేకుండాపోయింది.

Also Read: సిమెంట్‌ కంపెనీలకు ప్రభుత్వ మద్దతు..: నిజమే అంటారా!

అయితే.. ఎస్‌ఈసీకి ఉద్యోగుల్ని కూడా కల్పించలేకపోతే అది ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. ఉద్యోగులు పని చేయడానికి ఇష్టపడకపోవడానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకతనే. రేపు ఎవరైనా కొత్త ఎస్‌ఈసీని ప్రభుత్వం నియమిస్తే.. తామంటే తాము అని ఇప్పుడు వ్యతిరేకించిన ఉద్యోగులే దరఖాస్తులు చేసుకుంటారు. ప్రభుత్వం వద్దన్నా లాబీయింగ్ చేసుకుంటారు. మొత్తానికి ఎన్నికల నిర్వహణలో రాజ్యాంగంలో స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన సంస్థకు.. ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతున్న ఎన్నికల్ని నిర్వహించడానికి సిబ్బంది కూడా కల్పించలేనంత పరిస్థితి రావడం గమనార్హం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్