ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరేండ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. అప్పటి నుంచి ఎక్కడి పాలన అక్కడే నడుస్తోంది. విడిపోయిక ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కాగా.. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలుపొంది కేసీఆర్ సీఎం సీటు ఎక్కారు. ఆ సందర్భంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులే ఉండేవి. కొన్నికొన్ని సందర్భాల్లో తప్పితే ఎప్పుడు చేసినా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప సహకరించుకున్న దాఖలాలు లేవు.
Also Read: సంచలనం: కాపుల కోసం ముద్రగడ మరో కొత్త రాజకీయ పార్టీ
అయితే.. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నాటి గొడవలను పక్కనపెట్టి ఇరు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని తలిచాయి. అలా కొన్ని సందర్భాల్లో ఇరు ముఖ్యమంత్రులు కలిశారు కూడా. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు కాగా.. కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్‌కు జగన్ వచ్చారు. ఇలా ఆదిలో బాగానే నడుచుకున్నా.. తాజాగా కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం జగన్‌లో మంట రేపుతోందట.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్ ప్రత్యేకంగా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇప్పటికీ ఈ కోటా అమలవుతోంది. కానీ.. రాష్ట్రాలు మాత్రం ఈ కోటాను అమలు చేసే విషయంలో భిన్నాభిప్రాయాలతో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కోటా ఇప్పటికీ అమలు కాలేదు. తాజాగా కేసీఆర్ సర్కారు పదిశాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వంపై ఆ మేరకు ఒత్తిడి పెరగబోతోంది. ఇప్పటికే బీజేపీ నేతలు జగన్ సర్కారుతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయించాలని కోరుతూ గవర్నర్‌ను పలుమార్లు కోరారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ నిర్ణయం జగన్‌కు పెను సవాలు కానుంది.
Also Read: ఈ సీఎంలు పప్పులో కాలేస్తున్నారా..? : పరిణామాలు అలానే ఉన్నాయి మరి
కేంద్రం రెండేళ్ల క్రితమే పదిశాతం ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించినా ఏపీలో వైసీపీ సర్కారు మాత్రం అమలు చేసేందుకు సిద్ధం కాలేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ఈ కొత్త రిజర్వేషన్ల కారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్ధల్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ కొత్త రిజర్వేషన్ల అమలుకు ప్రయత్నిస్తే కొంత మంది నుంచి వ్యతిరేకత తప్పదని జగన్ అంచనా వేశారు. ఇప్పుడు కేసీఆర్ నిర్ణయంతో జగన్ కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్