https://oktelugu.com/

టీజర్ టాక్ : 8 ప్యాక్‌తో అదరగొట్టిన ల‌క్ష్య !

గ‌త‌ ఏడాది ‘అశ్వ‌త్థామ’తో హిట్ ను అందుకున్న నాగశౌర్య మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రసుతం మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ గా పెట్టుకుని వ‌రుడు కావ‌లెను, ల‌క్ష్య‌, పోలీస్ వారి హెచ్చ‌రిక అనే సినిమాలు చేస్తున్నాడు. కాగా తాజాగా రిలీజ్ చేసిన ‘లక్ష్య’ టీజర్ యూట్యూబ్‌లో వండర్ క్రియేట్ చేస్తోంది. జగపతి బాబు వాయిస్ ఓవర్ లో మొదలైన ఈ టీజర్ ఆటలో చాలా మందికి గుర్తింపు వస్తే ఆటకే […]

Written By: , Updated On : January 22, 2021 / 12:57 PM IST
Follow us on

Lakshya Teaser
గ‌త‌ ఏడాది ‘అశ్వ‌త్థామ’తో హిట్ ను అందుకున్న నాగశౌర్య మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రసుతం మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ గా పెట్టుకుని వ‌రుడు కావ‌లెను, ల‌క్ష్య‌, పోలీస్ వారి హెచ్చ‌రిక అనే సినిమాలు చేస్తున్నాడు. కాగా తాజాగా రిలీజ్ చేసిన ‘లక్ష్య’ టీజర్ యూట్యూబ్‌లో వండర్ క్రియేట్ చేస్తోంది. జగపతి బాబు వాయిస్ ఓవర్ లో మొదలైన ఈ టీజర్ ఆటలో చాలా మందికి గుర్తింపు వస్తే ఆటకే గుర్తింపు తెచ్చే వాడిగా నాగశౌర్య రోల్ ను ఎలివేట్ చేశారు. టీజర్ ఆసక్తికరంగా మొదలవ్వడంతో అందర్నీ ఆకట్టుకుంది.

Also Read: హిట్ అయితే జాత‌క‌మే మారిపోతుంది !

కాగా ఆర్చరీ నేపథ్యంలో సాగే ఈ కథను దర్శకుడు సంతోష్ జాగర్లపూడి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఆర్చ‌రీలో అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించిన వ్య‌క్తిగా నాగశౌర్య క‌నిపించబోతు‌న్నాడు. ల‌క్ష్య టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. ప‌డిలేచిన వాడితో పందెం చాలా ప్ర‌మాదం అంటూ జ‌గ‌ప‌తి బాబు చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. ఓవరాల్ గా టీజర్‌లో నాగ్ 8 ప్యాక్‌తో అదరగొట్టాడు. గత కొన్ని సినిమాలుగా నాగశౌర్య తన ఫెర్ఫామెన్స్‌తో యూత్‌కు బాగా అట్రాక్ట్ అయ్యాడు. డిఫరెంట్ మూవీస్‌తో అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు.

Also Read: ‘తొంగి తొంగి చూడమాకు చందమామ” విడుదల!

పైగా నటుడిగానే కాకుండా రచయితగా కూడా మంచి గుర్తింపును సంపాదించాడు. ఈ చిత్రంలో కేతిక శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. శ‌‌ర‌త్‌మరార్‌, నారాయ‌ణ్ దాస్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2021 మొద‌టి త్రైమాసికంలో ఈ మూవీని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విలు విద్యలో ఆరితేరిన హీరో దానికి దూరం అవ్వడం మళ్ళీ తిరిగి రెట్టింపు ఎనర్జీతో తిరిగి రావడం వంటివి మంచి ఇంటెన్స్ ఉన్న కథతో ఈ సినిమా రాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Lakshya Official Teaser - Naga Shaurya|Jagapathi Babu|Ketika Sharma|Dheerendra Santhossh Jagarlapudi