Also Read: టీడీపీ ప్రక్షాళన.. 25 లోక్ సభ నియోజకవర్గాలకు అధ్యక్షుల ప్రకటన
తనపై నమ్మకం ఉంచి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి రావడం కన్నా, ఆ పదవికి న్యాయం చేసినప్పుడే తనకు ఆనందం కలుగుతుందని పేర్కొన్నారు.
అంతేకాదు.. మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారామె. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం పాత్ర చాలా పరిమితమైందని, గతంలో ఈ విషయాన్ని రామ్ మాధవ్ వంటి నాయకులే చెప్పారని పేర్కొన్నారు. రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే నూతన వ్యవసాయ బిల్లులను ప్రవేశ పెట్టిందని, నూతన వ్యవసాయ బిల్లుల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వ్యవసాయ బిల్లులలో ఒకటి రెండు అంశాలలో ఆందోళన ఉన్నప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందని చెప్పుకొచ్చారు.
Also Read: ఉత్తరాంధ్రలో టీడీపీకి మరో షాక్.. పార్టీకి సీనియర్ గుడ్ బై
ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని పురంధేశ్వరి చెప్పారు. ప్రజల పక్షాన నిలిచి వారి నమ్మకానికి అండగా నిలుస్తామని తెలిపారు. ఏపీలో ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను బీజేపీ అధినాయకత్వం దగ్గరకు తీసుకువెళ్తానని పేర్కొన్నారు.