సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో ఒక్కొక్కరిని ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటి రకుల్‌ను విచారించగా.. ఆ తర్వాత దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌తోపాటు దీపిక మేనేజర్ కరీష్మా ప్రకాశ్‌ను విచారణకు పిలిచారు. సుమారు 5 గంటలపాటు ఈ విచారణ కొనసాగగా.. అధికారులు అడిగిన ప్రశ్నలకు దీపిక కన్నీరు పెట్టుకుందంట.
Also Read: ఉపాసన కోసం చెఫ్ గా మారిన సమంత
అడిగిన ప్రతీ ప్రశ్నకు కన్నీరు పెట్టుకోవడంతో అధికారులు అసహనానికి గురైనట్లు ఇంగ్లిష్ పేపర్లలో వార్తలు వచ్చాయి. ఎమోషనల్ డ్రామాను పక్కనపెట్టి సమాధానం చెప్పాలంటూ ఆమెను సున్నితంగా హెచ్చరించినట్లు కూడా సమాచారం. చివరగా.. ఇటీవల సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయా సాహా సెల్ ఫోన్ నుంచి వెల్లడైన వాట్సాప్ చాట్ తనదేనని.. కానీ తాను డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించినట్లు తెలిసింది.
నటి శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్‌ను విచారించగా.. నటుడు సుశాంత్ డ్రగ్స్ తీసుకునే వాడని, షూటింగ్ సమయంలో క్యారావ్యాన్‌లోకి వెళ్లి డ్రగ్స్ సేవించేవాడని వెల్లడించింది. ‘కేదార్‌నాథ్’ సినిమా టైంలో సుశాంత్‌తో సన్నిహితంగా ఉన్నానని.. అప్పుడప్పుడు అతని ఫామ్‌హౌస్‌లో జరిగే పార్టీలకు వెళ్లినట్లు చెప్పారు. కానీ ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని తెలిపారు.
Also Read: కరోనాను జయించిన నాగబాబు.. ఏం చేశాడంటే?
డ్రగ్స్ కేసులో దీపికా పదుకొణె, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్‌సింగ్, శ్రద్ధాకపూర్, దీపిక మేనేజర్ కరీష్మా ప్రకాశ్‌లను విచారించిన ఎన్సీబీ అధికారులు వీరి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయమై ఎన్సీబీ అధికారి అశోక్ జైన్ మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసు దర్యాప్తులో తాజాగా పలువురు హీరోయిన్లను విచారించామని, వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వారు విచారణలో చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికే సెల్‌ఫోన్ చాట్స్ పరిశీలిస్తున్నట్లు తెలిపారు.