Automated Fitness Test : నోయిడాలో ఈ సంవత్సరం ఆటోమేటిక్ వెహికల్ ఫిట్‌నెస్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈ సెంటర్‌లో వాహనాల ఫిట్‌నెస్ టెస్టింగ్ పూర్తి ఆటోమేటిక్ పద్ధతిలో జరుగుతుంది. పరీక్ష విజయవంతంగా పూర్తయిన తర్వాత, వాహనానికి దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అందుతుంది. గ్రేటర్ నోయిడాలో ఈ ఆటోమేటిక్ ఫిట్‌నెస్ సెంటర్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
ఆటోమేటిక్ వెహికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అంటే ఏమిటి?
ఈ ఫిట్‌నెస్ టెస్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం నిర్వహించబడుతుంది. టెస్టింగ్ సమయంలో వాహనంలోని అన్ని లోపాలు బయటపడతాయి. పరీక్ష విజయవంతంగా పూర్తయిన తర్వాత అందించే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ పరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ATS) ఏర్పాటుచేయబడతాయి.
ఆటోమేటిక్ ఫిట్‌నెస్ టెస్ట్ ప్రయోజనాలు
* సమయం ఆదా – సాధారణంగా హ్యూమన్ టెస్టింగుకు సమయం చాలా పడుతుంది. కచ్చితత్వం ఉండదు. కానీ ఆటోమేటిక్ టెస్టింగ్ ద్వారా వేగంగా ఫలితాలు వస్తాయి.
* ఖచ్చితమైన విశ్లేషణ – ఆటోమేటిక్ మిషన్లు వాహనాన్ని పూర్తిగా పరీక్షించి, ఖచ్చితమైన ఫలితాలను అందిస్తాయి.
* తక్కువ ఖర్చుతో ప్రాసెస్ – సాధారణ టెస్టింగ్ కంటే ఆటోమేటిక్ టెస్టింగ్ తక్కువ వ్యయంతో జరుగుతుంది.
* రోడ్డు ప్రమాదాల నివారణ – ఫిట్ నెస్ సరిగ్గా లేని వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల ప్రమాదాల అవకాశాలు తగ్గుతాయి.
* ప్రభుత్వ ఆదాయ వృద్ధి – ఈ పరీక్షల ద్వారా ప్రభుత్వానికి రెవెన్యూ కూడా సమకూరుతుంది.
* సేఫ్టీ హామీ – వాహనంలోని ప్రతి సాంకేతిక అంశాన్ని ఖచ్చితంగా టెస్ట్ చేయడం ద్వారా రోడ్డు భద్రత మెరుగవుతుంది.
ఫిట్‌నెస్ టెస్ట్ ప్రక్రియ
వాహన యజమానులు లేదా ఆపరేటర్లు సంబంధింత శాఖకు టెస్టింగ్ కోసం రిక్వెస్ట్ సమర్పించాలి. రిక్వెస్ట్ ఆమోదం పొందిన తర్వాత, టెస్టింగ్ నిమిత్తం వాహనాన్ని ఆటోమేటిక్ ఫిట్‌నెస్ సెంటర్‌కు తీసుకురావాలి. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ లేదా ప్రభుత్వ అధికారి ఆధ్వర్యంలో వాహనాన్ని పూర్తిగా పరీక్షిస్తారు. వాహనం అన్ని ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయని తెలిస్తేనే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. ఈ ఆటోమేటిక్ ఫిట్‌నెస్ సెంటర్ వల్ల వాహనాల భద్రత పెరుగడంతో పాటు, రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. నోయిడాలో దీని ప్రారంభంతో రవాణా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందనుంది.