https://oktelugu.com/

ఎస్వీబీసీ ఛానెల్ లో అసలేం జరుగుతోంది..?

ఆధ్యాత్మికత, ప్రశాంతతకు మారుపేరు తిరుమల దేవస్థానం. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా తిరుమల దేవస్థానంకు వచ్చేసరికి భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఇలాంటి భక్తి కార్యక్రమాలను చూపించేందుకు టీటీడీ ప్రత్యేకంగా ఎస్వీబీసీ అనే ఛానెల్ ను నిర్వహిస్తోంది. అయితే ఈ ఛానెల్లో పనిచేసే ఉద్యోగులు తమ విధులపై కాకుండా ఇతర విషయాలపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది. భక్తులకు సేవలందించకుండా కాలక్షేపం గడుపుతున్న వారి బండారం బట్టబయలైంది. Also Read: అవమానంగా ఫీలవుతున్న ఏపీ కాంగ్రెస్ మహిళా నేతలు..! తాజాగా కొందరు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 / 03:44 PM IST
    Follow us on

    ఆధ్యాత్మికత, ప్రశాంతతకు మారుపేరు తిరుమల దేవస్థానం. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా తిరుమల దేవస్థానంకు వచ్చేసరికి భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఇలాంటి భక్తి కార్యక్రమాలను చూపించేందుకు టీటీడీ ప్రత్యేకంగా ఎస్వీబీసీ అనే ఛానెల్ ను నిర్వహిస్తోంది. అయితే ఈ ఛానెల్లో పనిచేసే ఉద్యోగులు తమ విధులపై కాకుండా ఇతర విషయాలపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది. భక్తులకు సేవలందించకుండా కాలక్షేపం గడుపుతున్న వారి బండారం బట్టబయలైంది.

    Also Read: అవమానంగా ఫీలవుతున్న ఏపీ కాంగ్రెస్ మహిళా నేతలు..!

    తాజాగా కొందరు ఉద్యోగుల తీరుతో ఓ భక్తుడు టీటీడీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. అసలు ఆ భక్తులు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందో తెలిస్తే ఇంత ఘోరమా..? అనుకోక తప్పదు. ఇంతకు ఆ భక్తుడు టీటీడీకి ఎందుకు ఫిర్యాదు చేశాడు.

    శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసికి ఓ భక్తుడు మెయిల్ చేశాడు. తిరిగి ఆ భక్తుడికి ఫోర్న్ సైట్ వీడియో లింక్ వచ్చింది. దీంతో సదరు వ్యక్తి  టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ రెడ్డి సుబ్బారెడ్డితో పాటు ఈవో జవహర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన జవహర్ రెడ్డి టీటీడీ విజిలెన్ష్ కు సమాచారం ఇచ్చాడు.

    Also Read: ఏపీలోనూ బీజేపీ బలపడనుందా.?

    ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ విజిలెన్ష్, సైబర్ క్రైం టీం, ఈడీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. భక్తుడికి ఫోర్న్ సైట్ పంపిన ఉద్యోగితో పాటు కార్యాలయంలో విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తున్న 25 మంది సిబ్బందిని గుర్తించారు. దీంతో వారిపై చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ యంత్రాంగం సిద్ధమవుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    గతంలో ఎస్వీబీసీలో వేధింపులకు గురి చేశారని ఓ ఉద్యోగిని ఫిర్యాదు చేయడంతో సినీ నటుడు చైర్మన్ గా ఉన్న ప్రుథ్వీరాజ్ ను సస్పెండ్ చేశారు. అయితే ఆ తరువాత ఇలాంటి సంఘటనలతో ఎస్వీబీసీ నిర్వహణపై అసహనం వ్యక్తమవుతోంది. దీంతో అసలు ఛానెల్ లో ఏం జరుగుతోందనే ప్రశ్న అందరిలో మొదలైంది.