విజయ్ దేవరకొండ సినిమాలో మలయాళ హీరో !

డేరింగ్ డైరెక్టర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు పూరి జగన్నాథ్. కథలు కోసం సంవత్సరంపాటు గింజుకోవడం పూరికి నచ్చదు. సినిమా షూటింగ్ అంటే.. జస్ట్ మూడు నెలల్లో అయిపోవాల్సిందే. ఇండస్ట్రీలో తనలా సినిమాలు చేసే దమ్ము.. బహుశా ఈ జనరేషన్ లో ఎవ్వరికీ లేదేమో. అందుకే టాలీవుడ్ లో పూరి ప్రత్యేకం. పూరితో సినిమా చేయడానికి బాలయ్య లాంటి హీరోలు వెయిటింగ్ లో ఉన్నా.. పూరి మాత్రం ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ […]

Written By: Neelambaram, Updated On : November 11, 2020 4:33 pm
Follow us on


డేరింగ్ డైరెక్టర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు పూరి జగన్నాథ్. కథలు కోసం సంవత్సరంపాటు గింజుకోవడం పూరికి నచ్చదు. సినిమా షూటింగ్ అంటే.. జస్ట్ మూడు నెలల్లో అయిపోవాల్సిందే. ఇండస్ట్రీలో తనలా సినిమాలు చేసే దమ్ము.. బహుశా ఈ జనరేషన్ లో ఎవ్వరికీ లేదేమో. అందుకే టాలీవుడ్ లో పూరి ప్రత్యేకం. పూరితో సినిమా చేయడానికి బాలయ్య లాంటి హీరోలు వెయిటింగ్ లో ఉన్నా.. పూరి మాత్రం ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అంటూ ఓ సినిమా చేస్తోన్నాడు. ఇక ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. డాన్ గా మలయాళ హీరో సురేష్ గోపి కనిపించబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

Also Read: చిరంజీవికి ‘పాజిటివ్’.. నాగ్ కు ‘నెగిటివ్’..!

అసలు సురేష్ గోపి అంటే తెలుగు వాళ్లకు పెద్దగా తెలియదు గానీ, మలయాళంలో ఆయన ఒకప్పుడు మంచి హీరో. తమిళనాట కూడా సురేష్ గోపికి మంచి గుర్తింపు ఉంది. అయితే విజయ్ దేవరకొండ సురేష్ గోపి కొడుకుగా కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని.. తండ్రికొడుకుల ఎమోషన్ చాలా బాగుంటుందని తెలుస్తోంది. విజయ్ సినిమాలో చాల భాగం తండ్రికి వ్యతిరేకంగా పని చేస్తుంటాడట. మరి ఈ తండ్రికొడుకుల ఎమోషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 16 నుండి మొదలుకానుంది.

Also Read: ‘గ‌మ‌నం’ ట్రైల‌ర్‌: వరదలా ఉప్పొంగిన ఎమోష‌న్‌..!

కాగా ఆ షెడ్యూల్ లో హీరో హీరోయిన్ల పై సాంగ్స్ తీయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం కొన్ని వర్కౌట్స్ చేశాడు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడు. అలాగే ఫైటర్ కోసం ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు ఫైటర్ రూపంలో ఆ అవకాశం రావడంతో అందుకే ఫైటర్ కోసం తెగ కష్ట పడుతున్నాడు. మరి విజయ్ దేవరకొండకు ఫైటర్ ఏ రేంజ్ హిట్ ను ఇస్తోందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్