రోజుకు రూ.400తో పిల్లలను కోటీశ్వరులను చేసే ఛాన్స్.. ఎలా అంటే..?

దేశంలో చాలామంది తల్లిదండ్రులు తాము కష్టపడినా పిల్లలు సంతోషకరమైన జీవనం గడపాలని వాళ్లు ఎటువంటి కష్టాలు పడకూడదని భావిస్తూ ఉంటారు. రేయింబవళ్లు కష్టబడుతూ పిల్లల కోసం తల్లిదండ్రులు డబ్బును పొదుపు చేస్తూ ఉంటారు. అయితే ఇతర స్కీమ్ లతో పోలిస్తే పీపీఎఫ్ స్కీమ్ లో డిపాజిట్ చేయడం ద్వారా పిల్లలకు బంగారం లాంటి భవిష్యత్ ను ఇవ్వవచ్చు. రోజుకు కేవలం 400 రూపాయలు ఆదా చేసి పిల్లలను సులువుగా కోటీశ్వరులను చేయవచ్చు. నెలకు 12,000 రూపాయల చొప్పున […]

Written By: Kusuma Aggunna, Updated On : November 11, 2020 3:47 pm
Follow us on


దేశంలో చాలామంది తల్లిదండ్రులు తాము కష్టపడినా పిల్లలు సంతోషకరమైన జీవనం గడపాలని వాళ్లు ఎటువంటి కష్టాలు పడకూడదని భావిస్తూ ఉంటారు. రేయింబవళ్లు కష్టబడుతూ పిల్లల కోసం తల్లిదండ్రులు డబ్బును పొదుపు చేస్తూ ఉంటారు. అయితే ఇతర స్కీమ్ లతో పోలిస్తే పీపీఎఫ్ స్కీమ్ లో డిపాజిట్ చేయడం ద్వారా పిల్లలకు బంగారం లాంటి భవిష్యత్ ను ఇవ్వవచ్చు. రోజుకు కేవలం 400 రూపాయలు ఆదా చేసి పిల్లలను సులువుగా కోటీశ్వరులను చేయవచ్చు.

నెలకు 12,000 రూపాయల చొప్పున దీర్ఘకాలం ఆదా చేస్తే పీపీఎఫ్ స్కీమ్ ద్వారా ఉత్తమ ప్రయోజనాలను పొందగలుగుతాము. ప్రస్తుతం దేశంలో ఉన్న ఉత్తమ రిటైర్మెంట్ స్కీమ్ లలో పీపీఎఫ్ స్కీమ్ కూడా ఒకటి. పీపీఎఫ్ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందడంతో పాటు లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. 15 నుంచి 20 సంవత్సరాల వరకు పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం ఉంటుంది.

కనీసం 500 రూపాయల నుంచి గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఎంతమొత్తమైనా పీపీఎఫ్ ఖాతాలో జమ చేయవచ్చు. నెలకు 12,500 రూపాయల చొప్పున పీపీఎఫ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 25 సంవత్సరాలకు ఏకంగా కోటీ మూడు లక్షల రూపాయలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఇతర స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టినా ఈ స్థాయి రాబడిని పొందడం సాధ్యం కాదు.

కేంద్రం ప్రస్తుతం 7.1 శాతం వార్షిక వడ్డీ ప్రాతిపదికన పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేసిన ఖాతాదారులకు వడ్డీ చెల్లిస్తోంది. కేంద్రం నిర్ణయాలను బట్టి వడ్డీరేట్లలో మార్పులు ఉంటాయి. భవిష్యత్తులో వడ్డీరేట్లు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి పీపీఎఫ్ స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టేవాళ్లు మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉంటుంది.