జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుగానే గుర్తించి పదిహేను శాతం వరకు స్టైఫండ్ పెంచుతూ జీవో జారీ చేసినా మరిన్ని డిమాండ్లతో సమ్మెకు దిగారు. దీంతో కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించినా సమ్మె చేయడం సమంజసం కాదు. కరోనా సమయంలో ఇలా సమ్మె చేయడం ద్వారా రోగుల్ని ఇబ్బందులకు గురి చేయడమేనని పలువురు పేర్కొంటున్నారు.
జూనియర్ డాక్టర్ల న్యాయపరమైన డిమాండ్లు, పెండింగులో ఉన్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ కరోనా కట్టడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా జూనియర్ డాక్టర్ల సమ్మె చేయడం సబబు కాదు. యాభై వేల మంది మెడికల్ స్టాఫ్ ను తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాల్సిందిగా సూచించారు. థర్డ్ వేవ్ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినా జూనియర్ డాక్టర్ల సమ్మెతో పరిస్థితులు మారిపో యాయి. ఆపద సమయంలో ఆదుకోవాల్సిన డాక్టర్లే సమ్మె చేయడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది.
కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ తక్షణమే స్పందించారు. నాలుగు రోజుల క్రితమే కేటీఆర్ జూనియర్ డాక్టర్ల స్టయిఫండ్ పెంచుతూ జీవో జారీ చేశారు. కేసీఆర్ పిలుపుపై జూనియర్ డాక్టర్లు స్పందిస్తే మంచింది. కరోనా సమయంలో జూనియర్ డాక్టర్ల సమ్మెపై తీవ్రంగా స్పందిస్తే వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న వస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరించిన కేసీఆర్ జూనియర్ డాక్టర్ల విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
జూనియర్ డాక్టర్ల సమ్మెతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కరోనా సె కండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మో గిస్తున్న తరుణంలో వారు అర్థం చేసుకోకుండా సమ్మెకు దిగడం అసమంజసం. ప్రజలకు సేవలందించాల్సిన వైద్యులే పట్టించుకోకుండా సమ్మెకు నిర్ణయించడం కరెక్టు కాదని చె బుతున్నారు. జూనియర్ డాక్టర్లు స్పందించి తక్షణమే సమ్మె విరమణ చేసేందుకు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.