https://oktelugu.com/

Acharya: ఆచార్య ప్లాప్ టాక్ రావడానికి ఇవే 10 కారణాలు..

Acharya: ఇద్దరు స్టార్ హీరోలు.. అందులోనూ తండ్రీ కొడుకులు.. ఇక ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇద్దరు మెగా హీరోలను ఒకే తెరపై చూస్తే రెండు కళ్లు చాలవు. ఈ దిశగా సినిమా వస్తే ఎలా ఉంటుంది..? అని ఫ్యాన్స్ అనుకుంటున్న సమయంలో కొరటాల శివ కొత్త ప్రయోగం చేశాడు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లను పెట్టి ‘ఆచార్య’ సినిమా తీశారు. ఈ సినిమా ప్రారంభం నుంచే ఫ్యాన్స్ ఎన్నో […]

Written By:
  • NARESH
  • , Updated On : May 4, 2022 12:23 pm
    Follow us on

    Acharya: ఇద్దరు స్టార్ హీరోలు.. అందులోనూ తండ్రీ కొడుకులు.. ఇక ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇద్దరు మెగా హీరోలను ఒకే తెరపై చూస్తే రెండు కళ్లు చాలవు. ఈ దిశగా సినిమా వస్తే ఎలా ఉంటుంది..? అని ఫ్యాన్స్ అనుకుంటున్న సమయంలో కొరటాల శివ కొత్త ప్రయోగం చేశాడు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లను పెట్టి ‘ఆచార్య’ సినిమా తీశారు. ఈ సినిమా ప్రారంభం నుంచే ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. సినిమా ఎప్పుడు వస్తుందా..? అని లక్ష కళ్లతో ఎదురుచూశారు. మొత్తానికి గతనెల 29న రిలీజైంది ఆచార్యం. కానీ అనుకున్నంత రేంజ్ లో ఆచార్య రాణించలేకపోయింది. ఫ్యాన్స్ ఆశలు ఆవిరయ్యాయి. మొదటి రోజు నుంచే ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సినిమాలో ఎక్కడ లోపం ఏర్పడింది.. ? అసలు సినిమా ఫెయిల్ అవడానికి కారణాలేంటి..? అని పరిశీలిస్తే.

    Acharya movie

    మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే దాదాపుగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం ఉంటుంది. అందులోనూ చిరంజీవి తన కుమారుడు, స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి సినిమా అంటే థియేటర్లు దద్దరిల్లాలి అనుకున్నారు. కానీ సినిమా స్టోరీ చూశాక ఫ్యాన్స్ ఒక్కసారిగా డిస్సాపాయింట్ అయ్యారు. స్టోరీలో ఏమాత్రం బలం లేకపోవడంతో సినిమా ఆకట్టుకోలేకపోయింది. పూర్తిగా నక్సలిజాన్ని చూపించడం సినిమాకు మైనస్ గా మారింది.

    Also Read: Senior NTR: రెండు రోజులైనా ఎన్టీఆర్ లేవలేదు.. ఆమె ఏడుస్తూనే ఉంది !

    ఆచార్య సినిమాకు రూ.130 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. అయితే ఇంతలా బడ్జెట్ రాబట్టుకోవాలంటే టికెట్స్ రేట్స్ పెంచక తప్పలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీగా ధర పెట్టి సినిమాను చూడడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఫస్ట్ డే నుంచి థియేటర్లకు ప్రేక్షకులు కరువయ్యారు.

    సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరో అయినా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. రాజమౌళి తో సినిమా తీసిన తరువాత సినిమా ప్లాప్ అవుతుందనే నానుడి ఉంది. ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత ఆచార్యలోనూ నటించారు. ఈ సెంటిమెంట్ రామ్ చరణ్ కు జరిగింది.

    Acharya

    సోనూసుద్ విలన్ గా ఎంత గా నటిస్తారో అందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్య ఆయన రియల్ గా హీరో అయ్యాడు. దీంతో సోనూ సుద్ విలనిజం సినిమాలో పండలేదు. దీంతో సినిమా ప్లాప్ కావడానికి ఇదో కారణం అయిందని అంటున్నారు. ఇక హీరోయిన్ పూజా హెగ్డేకు వరుసగా ప్లాప్ లు వస్తున్నాయి. ఆమె ఖాతాలో ఇప్పుడు ఆచార్య కూడా పడింది. ఆచార్య సినిమాలో మొదట కాజల్ అని తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె సీన్లన్నీ కట్ చేశారు. అప్పటి వరకు చిరంజీవి సినిమాలో కాజల్ అలరిస్తుందని అనుకున్న వాళ్లు ఆమె లేకపోవడం మైనస్ గా మారింది.

    చిరంజీవి సినిమాలో హీరోయిజంతో పాటు కామెడీ కూడా ఉంటుంది. ఆయన కామెడీ ప్రధానంగా చంటబ్బాయ్ లాంటి సినిమాలు హిట్టుకొట్టాయి. ఇక రీసెంట్ సినిమాల్లోనూ చిరు కామెడీతో అదరగొట్టారు. కానీ ఆచార్యలో మాత్రం చిరు కామెడీ ఎక్కడా కనిపించలేదు. దీంతో చిరు సినిమాలో కామెడీ లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది.

    Also Read:Films in May: మే లో రిలీజుకు రెడీ అవుతున్న చిత్రాలివే..!

    Tags