https://oktelugu.com/

Koushik Reddy MLC Post: కౌశిక్ రెడ్డి కథ ఏమైంది కేసీఆర్ సారూ?

హుజురాబాద్ టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి జంప్ అయి టీఆర్ఎస్ లో చేరిన ఆయనకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. కానీ ఇంతవరకు ఆయన పదవి ఖరారు కాలేదు. దీంతో ఆయనకు ఆశ తీరే రోజు కోసం తాపత్రయపడుతున్నారు. ఇప్పటికే రెండు వారాలు దాటిపోయినా ఆయనకు దారి సుగమం కావడం లేదు. దీంతో కౌశిక్ రెడ్డికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. పదవి వచ్చిందని సంతోషమున్నా దాన్ని […]

Written By: , Updated On : August 18, 2021 / 04:24 PM IST
Follow us on

TRS Koushik Reddyహుజురాబాద్ టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి జంప్ అయి టీఆర్ఎస్ లో చేరిన ఆయనకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. కానీ ఇంతవరకు ఆయన పదవి ఖరారు కాలేదు. దీంతో ఆయనకు ఆశ తీరే రోజు కోసం తాపత్రయపడుతున్నారు. ఇప్పటికే రెండు వారాలు దాటిపోయినా ఆయనకు దారి సుగమం కావడం లేదు. దీంతో కౌశిక్ రెడ్డికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. పదవి వచ్చిందని సంతోషమున్నా దాన్ని నెరవేర్చుకునే తరుణం రాకపోయే సరికి అసంతృప్తికి లోనవుతున్నారు.

కేబినెట్ నుంచి ఆమోదం పొందిన తరువాత ఎమ్మెల్సీ స్థానాల భర్తీని గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనికి రెండు మూడు రోజలు మాత్రమే సరిపోతుంది. కానీ రెండు వారాలుగా కౌశిక్ రెడ్డి ఫైల్ పై గవర్నర్ ఆమోదం తెలపడం లేదు. దీంతో ఆయన పదవి నామమాత్రమే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదివరకే కౌశిక్ రెడ్డిపై పలు కేసులు ఉండడంతో ఆలస్యమవుతుందని భావిస్తున్నారు. కొద్ది రోజుల కింద ఏపీ ప్రభుత్వం గవర్నర్ కోటాలో భర్తీ చేసిన ఎమ్మెల్సీ స్థానాలపై అభ్యంతరాలు ఉన్నాయన్న ప్రచారం జరగడంతో మూడు రోజుల పాటు మాత్రమే ఆమోదముద్ర వేయలేదు. కానీ జగన్ వెళ్లిన తరువాత గవర్నర్ ఆ ఫైల్ పై సంతకం చేశారు. దీంతో వారి కోరిక నెరవేరింది. ఇక్కడ రెండు వారాలు దాటిపోయినా కేసీఆర్ పట్టించుకోకపోవడంపై సందేహాలు వస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం నుంచి ఫాలో ఆన్ లేకపోవడంతో ఆ ఫైల్ విషయంలో గవర్నర్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాడి కౌశిక్ రెడ్డిపై గతంలోనే పలు కేసులు ఉండడంతో నే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయన పేరును ఖరారు చేసేందుకు ఆలోచిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఒక మాట చెబితే పని అయిపోతుందని తెలిసినా కేసీఱర్ పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే సీటు రాకపోయినా కనీసం ఎమ్మెల్సీ అయినా వచ్చిందని సంతోషపడుతున్నా ప్రమాణం రోజు ధూంధాం చేద్దామని భావిస్తున్నా ఆయన కోరిక మాత్రం తీరడం లేదు.

గతంలో కాంగ్రెస్ లో ఉన్న కౌశిక్ రెడ్డి కొన్ని నాటకీయ పరిణామాల మధ్య టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 60 వేల ఓట్లు సాధించి తన ఇమేజ్ పెంచుకున్నారు. ఈ సారి కూడా అదే పార్టీ నుంచి టికెట్ వస్తుందని ఆశించినా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక ఇక సీటు తనకు రాదని భావించి కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగారు. అధికార పార్టీ టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నట్లు తేలడంతో రేవంత్ రెడ్డి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన టీఆర్ఎస్ లో చేరి టికెట్ ఆశించినా కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి అప్పగించినా పూర్తి స్థాయిలో ఆమోదముద్ర పడకపోవడంతో ఆయనకు ఎదురుచూపులే మిగులుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.