ఇంటర్ లో మ్యాథమాటిక్స్ ఒక సబ్జెక్ట్ గా చదువుకున్న వాళ్లు మాత్రమే టెక్ బీ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతేడాది, ఈ ఏడాది ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్‌సిఎల్ టెక్ బీ ప్రోగ్రామ్ కు ఎంపికైన విద్యార్థులకు విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులపై ఆధారపడకుండా కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడలలో ఇందుకు సంబంధించిన శిక్షణా కేంద్రాలు ఉన్నాయి.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు ఇంటర్న్ షిప్ సమయంలో 10,000 రూపాయలు స్టైఫండ్ గా పొందే అవకాశం ఉంటుంది. శిక్షణ పూర్తైన తర్వాత హెచ్‌సిఎల్ లో పూర్తిస్థాయి ఉద్యోగులుగా చేరడం ద్వారా 2,20,000 రూపాయల వరకు వేతనంగా పొందవచ్చు. హెచ్‌సిఎల్ లో పని చేస్తూ ఇతర యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కూడా ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఆన్ లైన్ లో శిక్షణ కోసం అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.