https://oktelugu.com/

Manchu Vishnu: ఇక్కడే ఏమి చేయలేని విష్ణు ఇక అక్కడేం చేస్తాడు ?

Manchu Vishnu: మంచు విష్ణు ‘మా’ ప్రెసిడెంట్ గా ఫెయిల్ అయ్యాడా ? సినీ జనంలో విష్ణు పై వ్యతిరేకత పెరుగుతుందా ? మా ఎన్నికల్లో ఎన్నో మాటలు, హామీలు ఇచ్చి.. ఎలాగోలా గెలిచి చివరకు విష్ణు చేస్తోంది ఏమిటి ? అసలు ఇప్పటివరకు విష్ణు ఏమి చేశాడు ? ముప్పై ఏళ్ళు తన కలంతో సినీ కళామతల్లిని లాలించిన ఓ మహా కవి చనిపోతే, విష్ణు కడసారి చూసేందుకు కూడా వెళ్ళకపోతే.. ఇక అతనికి పదవి […]

Written By:
  • Shiva
  • , Updated On : December 2, 2021 / 05:12 PM IST
    Follow us on

    Manchu Vishnu: మంచు విష్ణు ‘మా’ ప్రెసిడెంట్ గా ఫెయిల్ అయ్యాడా ? సినీ జనంలో విష్ణు పై వ్యతిరేకత పెరుగుతుందా ? మా ఎన్నికల్లో ఎన్నో మాటలు, హామీలు ఇచ్చి.. ఎలాగోలా గెలిచి చివరకు విష్ణు చేస్తోంది ఏమిటి ? అసలు ఇప్పటివరకు విష్ణు ఏమి చేశాడు ? ముప్పై ఏళ్ళు తన కలంతో సినీ కళామతల్లిని లాలించిన ఓ మహా కవి చనిపోతే, విష్ణు కడసారి చూసేందుకు కూడా వెళ్ళకపోతే.. ఇక అతనికి పదవి ఎందుకు ?

    Manchu Vishnu

    గెలిచిన నెల రోజులు లోపే ‘మా’ భవనం కట్టడం మొదలు పెడతాను అన్నాడు. గెలిచాక, తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను అన్నాడు. ఆ తర్వాత ఏవేవో చెప్పాడు. చివరకు ‘మా’ సంఘానికి చిరకాలంగా వున్న భవన సమస్యకు పరిష్కారం చూపించాలి అంటే.. ప్రభుత్వాలు సహకరించాలి అంటున్నాడు. అసలు విష్ణుకు ఏమైంది ? క్రమశిక్షణకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే మోహన్ బాబుకి ఏముంది ?
    Also Read: సినీ దిగ్గజాలు చనిపోయినా పలకరించరా.. మంచు ఫ్యామిలీకి ఏమైంది ?

    జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మోహన్ బాబు అయినా విష్ణుకు చెప్పాలి కదా ? అయినా మంచు విష్ణు తాను ఇచ్చిన హామీలకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లు ఇవ్వట్లేదు ?, చివరకు మా భవనంలో ఉన్న చిన్నాచితకా ఆర్టిస్ట్ లు సైతం ఈ విషయంలో బాగా అసంతృప్తిగా ఉన్నారు. మా సంఘంలో మిగిలిన సభ్యులు ఇదే విషయం పై గుసగుసలాడుతున్నారు.

    మరోపక్క విష్ణు పై మరో టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. విష్ణు అసలు మా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నదే వేరే ఉద్దేశ్యంతో అని, విష్ణు తర్వాత ప్లాన్.. రాజకీయమే అని. విష్ణు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. మోహన్ బాబు కోరిక మేరకు మంచు విష్ణు రాజకీయాల్లో అడుగు పెడతాడట. మా ఎన్నికల్లో గెలిచి సినిమా ప్రముఖులు చనిపోయినా చూడటానికి వేళ్ళని విష్ణు, ఇక రాజకీయాల్లోకి వెళ్లి ప్రజలకు ఏమి మంచి చేస్తాడో ?

    Also Read: సీనియర్ నటుడు శరత్​బాబు ఫ్యామిలీ నుంచి హీరోగా ఆయుష్​

    Tags