Balayya: బాలయ్య ఊపు తెచ్చాడు.. బాక్సాఫీస్ ను ఊపేశాడు !

Balayya: కరోనా సెకెండ్ వేవ్ తర్వాత.. ఆ మాటకొస్తే.. కరోనా తర్వాత నుంచీ టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఊపు కనిపించలేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లాంటి సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో అలరించినా.. నిజమైన హిట్ తో మిగిలిన సినిమాలకు మాత్రం ఊపు తేలేకపోయాయి. దాంతో తెలుగు సినిమాకి కరోనా అనంతరం ఈ రోజు వరకు సాలిడ్ హిట్ పడలేదు. కానీ, బాలయ్య అఖండతో ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. థియేటర్స్ దగ్గర జనం బారులు […]

Written By: Shiva, Updated On : December 2, 2021 5:34 pm
Follow us on

Balayya: కరోనా సెకెండ్ వేవ్ తర్వాత.. ఆ మాటకొస్తే.. కరోనా తర్వాత నుంచీ టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఊపు కనిపించలేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లాంటి సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో అలరించినా.. నిజమైన హిట్ తో మిగిలిన సినిమాలకు మాత్రం ఊపు తేలేకపోయాయి. దాంతో తెలుగు సినిమాకి కరోనా అనంతరం ఈ రోజు వరకు సాలిడ్ హిట్ పడలేదు.

Balayya

కానీ, బాలయ్య అఖండతో ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. థియేటర్స్ దగ్గర జనం బారులు తీరారు. అసలు.. ఇన్నాళ్లు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ రేంజ్ కు రాలేదు అని బాధ పడ్డ సినీ అభిమానులు.. ప్రముఖులు అఖండతో ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది.

బాలయ్య తన మార్క్ యాక్షన్ తో బాక్సాఫీస్ ను కిచిడీ కిచిడీ చేసి పారేశాడు. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అఖండ సినిమా కోసం ఎగబడుతున్నారు. నిజానికి అఖండకు విడుదలకు ముందు నుంచి విమర్శల ప్రశంసలు అందాయి. అటు బాలయ్య అఘోర లుక్ కూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది.
దాంతో సినిమా బాగుంటుందనే పాజిటివిటీ మధ్యన అఖండ రావడం.. అఖండమైన విజయం సాధించడం శుభపరిణామం.

Also Read: ‘అఖండ’ విజయం టాలీవుడ్ కి ఊపు తెచ్చిందా?

ఇప్పుడు ఇంకో సమస్య మొదలైంది. ఎల్లుండి సత్యదేవ్, నిత్యామీనన్ సినిమా ఉంది. అలాగే మరో రెండు చిన్న సినిమాలు ఏవో ఉన్నాయి. మరి అఖండ ప్రవాహంలో వచ్చే ఆ సినిమాల పరిస్థితి ఏమిటి ? అసలు బాలయ్య హిట్ సినిమాకు పోటీ తట్టుకుని నిలబడటం అసాధ్యం. ఇతర స్టార్ హీరోల సినిమాలేవీ గతంలో బాలయ్య సినిమా పై వచ్చి ఆకట్టుకోలేకపోయాయి.

మరి పుష్ప ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా తెలుగు సినిమా బాక్సాఫీసు దగ్గర సరైన సినిమా పడక టాలీవుడ్ బాగా నీరసించిపోయింది. అయితే ఎట్టకేలకు డీలా పడిన తెలుగు సినిమాకు బాలయ్య మళ్ళీ ఊపు తెచ్చాడు. అయినా మాస్ సినిమా అంటేనే బాలయ్య. అన్నట్టు కలెక్షన్స్ లో కూడా బాలయ్య ఈ సారి వండర్స్ క్రియేట్ చేసేలా ఉన్నాడు.

Also Read: ‘అఖండ’ అఖండమైన విజయానికి అదే కారణం !

Tags