DGP Mahender Reddy: ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ టెన్షన్.. స్వయంగా రంగంలోకి దిగిన DGP మహేందర్ రెడ్డి

DGP Mahender Reddy: తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నట్టుండి మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ఏరియాలో బుధవారం పర్యటించారు. అక్కడి అధికారులతో సమావేశమై కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మావోయిస్టులను ఏరివేసేందుకు ఆయన సారథ్యంలో కీలక సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు కొలువుదీరిన నాటి నుంచి మావోయిస్టులు ఉక్కుపాదం మోపుతూ వచ్చారు. దీంతో మావోయిస్టు […]

Written By: Neelambaram, Updated On : December 2, 2021 5:07 pm
Follow us on

DGP Mahender Reddy: తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నట్టుండి మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ఏరియాలో బుధవారం పర్యటించారు. అక్కడి అధికారులతో సమావేశమై కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మావోయిస్టులను ఏరివేసేందుకు ఆయన సారథ్యంలో కీలక సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు కొలువుదీరిన నాటి నుంచి మావోయిస్టులు ఉక్కుపాదం మోపుతూ వచ్చారు. దీంతో మావోయిస్టు పార్టీ కొంత బలహీన పడిన విషయం తెలిసిందే. ఇటీవల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత ‘ఆర్కే’ మృతి కూడా ఆ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టిందని చెప్పవచ్చు.

DGP Mahender Reddy

ఒక్కసారిగా అప్రమత్తం..

మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. స్వయంగా డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటనతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అధికారులు, భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురంలో డీజీపీ మహేందర్ రెడ్డి అకస్మాత్తుగా పర్యటించి సరిహద్దుల్లో ఏం జరుగుతుందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాహన తనిఖీల విధానం, మవోయిస్టుల కదలికలు, కూంబింగ్‌ ఏలా జరుగుతోంది, బేస్‌క్యాంపుల నిర్వహణ వంటి వాటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గంజాయి రవాణా ఓ లుక్కేయ్యండి..

ఏపీలోని విశాఖ మణ్యం ఏజెన్సీ నుంచి తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలకు పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి గంజాయి రవాణాను అడ్డుకోవాలన్నారు. ఇదే విషయమై భద్రాచలం దగ్గర గల సారపాక ఐటీసీ గెస్ట్‌హౌస్‌‌లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు ఎస్పీలతో డీజీపీ సమావేశం నిర్వహించారు. గంజాయి రవాణా మాటున డైవర్ట్ చేసి మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహించకుండా చూడాలన్నారు.

Also Read: ఆదుకుంటానని.. రైతులను నిండా ముంచారు.. గవర్నర్‌కు టీపీసీసీ ఫిర్యాదు..!

భద్రత పెంపునకు ఆదేశం..

తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఆంధ్రా బోర్డర్లలో పోలీసుల నిఘాను పెంచాలని డీజేపీ సంబంధిత అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 2 నుంచి 8వ ఏజెన్సీలో వారోత్సవాలను నిర్వహించాలని మావోయిస్టులు నిర్ణయించారు. దీంతో అనుమానిత వ్యక్తుల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు. ఏజెన్సీలో ఇప్పటీకే ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేశారు. కాగా, మావోయిస్టు పీఎల్‌జీఏ 21వ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని చర్ల- శబరి ఏరియా మావోయిస్టు పార్టీ కార్యదర్శి అరుణ పిలుపును ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ వారోత్సవాలు జరగకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు. పోలీసులు అటాక్స్, కరోనా విజృంభణ, ఇతర ఆరోగ్య సమస్యలతో మావోయిస్టు పార్టీ ప్రధాన నాయకత్వాన్ని కోల్పోయింది. అందుకే వారోత్సవాల పేరుతో కొత్త సభ్యులను నియమించుకోవాలని మావోయిస్టు పార్టీ భావించినట్టు తెలుస్తోంది. అందుకోసమే స్వయంగా డీజీపీ రంగంలోకి ఏజెన్సీలో పర్యటిస్తున్నట్టు తెలిసింది.

Also Read: కేసీఆర్ తిట్ల బాగోతం.. వెనుక ఉన్నది అతడేనా?

Tags