‘ఎవరి జీవితమూ శాశ్వతం కాదు.. ఎవరమైనా ఎపుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే.. నాకు చావు మీద ఎలాంటి భయమూ లేదు’ అంటూ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నిత్యం పలికే మాటలివి. అయితే.. తాను చనిపోయాక తన స్మారకార్థం నిర్మించే సమాధిపై మాత్రం ఏం రాయాలో చెప్పారంట. అదీ 20 ఏళ్ల కిందటే.
Also Read: బాలు అంత్యక్రియలకు హాజరైన ఏపీ మంత్రి అనిల్..
1999లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఓ పాటల పోటీకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనంటే ఎస్పీ బాలుకు ఎంతో గురు భక్తి. తాను నిర్వహిస్తున్న కార్యక్రమానికి మంగళంపల్లి రావడంతో బాలు చాలా ఆనందపడ్డారు.
అయితే.. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ బాలును ఉద్దేశించి మాట్లాడారు. ‘కష్టపడితే తనలా బాలు పాడగలడని.. కానీ తాను ఎంత సాధన చేసినా కూడా బాలులా పాడలేనని’ చెప్పాడు. ఆ మాటలు విన్న బాలుకి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. గురుతర సమానులైన మంగళంపల్లి నుంచి అలాంటి మాటలు రావడంతో తన జన్మ ధన్యమైందని భావించారు.
Also Read: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి
వెంటనే బాలు స్పందిస్తూ.. ‘ఇంతకంటే తన జీవితానికి ఇంకేం కావాలి. గురుతుల్యులు అయిన మంగళంపల్లి లాంటి వారే నా గురించి ఇలాంటి మాటలు చెప్పడం నిజంగా అదృష్టం. నా జీవితంలో ఇంతకంటే గొప్ప ప్రశంసలు ఏం లేవు. నేను చనిపోయిన తర్వాత సమాధిపై ఏమైనా రాయాలనుకుంటే బాలమురళీకృష్ణలాంటి మహానుభావులు బాలసుబ్రహ్మణ్యం గురించి ఇలా అన్నాడు’ అని రాయాలని కోరారు. గతలంలో బాలు చేసిన ఈ వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ ఇప్పుడు ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగారు.