అసలు కరోనా ఎలా వచ్చిందని దాని పుట్టుపూర్వోత్తరాలు కనుక్కోవడానికి ప్రపంచ దేశాలు కృషి చెయ్యాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఐక్యరాజ్యసమితి సమావేశంలో మాట్లాడారు. కరోనా మూలాల గురించి తెలుసుకుంటే మరోసారి ఇలాంటి మహమ్మారి భారిన పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవచ్చు అన్నారు. కరోనా జెనెటిక్ మూలాన్ని, అది మానవులకు ఎలా వ్యాపించిందో తెలుసుకోవసల్సిన అవసరం చాల ఉందని తెలిపారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాకు ఎవ్వరు వాక్సిన్ ను కనిపెట్టిన దానిని ప్రపంచ దేశాలన్నిటితో పంచుకోవడం నైతిక బాధ్యత అని అన్నారు.