sp balu
ఆ చిన్నపాటి నిర్లక్ష్యమే పాటల స్వర శిఖరమైన ఎస్పీ బాలుని స్వర్గ సీమకు తీసుకెళ్లిందా..? ఆ నిర్లక్ష్యం వల్లే ఆయనకు కరోనా అంటుకుందా..? ఆ ప్రోగ్రాంలోనే ఆయనను కరోనా ఆవహించిందా..? తాజాగా వెలుగులోకి వచ్చిన ఆ వీడియోను చూస్తే అందరికీ అదే అర్థమవుతోంది.
తాజాగా టోక్యో తమిళ సంఘం నిర్వహించిన పాటల ప్రోగ్రామ్ కోసం జూలై లో వెళ్లి ఎస్పీ బాలు పాడి వచ్చాడు. అక్కడ బాలు చేసిన 3 తప్పులే ఆయనకు కరోనా సోకడానికి కారణం అనే వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ప్రోగ్రాం తర్వాత జూలై 30న బాలు రామోజీ ఫిలిమ్ సిటీకి వెళ్లాడు. అదే రోజు అక్కడికి హేమచంద్ర, అనుదీప్, ప్రణవి, లిప్సిక వచ్చారు. 31న కారుణ్య, దామిని, సత్య యామిని, మాళవిక, పావని తదితరులు చేరుకున్నారు. అయితే.. అప్పటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read: బాలు అంత్యక్రియలకు హాజరైన ఏపీ మంత్రి అనిల్..