https://oktelugu.com/

బట్టలిప్పి టీమిండియా ఆటగాళ్లు ఏం చేస్తున్నారంటే?

కరోనా చేయబట్టి ప్రశాంతంగా ఒకరినొకరు మాస్కులు లేకుండా కలుసుకోలేని పరిస్థితి. మొదటి వేవ్ పోయింది.. రెండో వేవ్ పోయింది. అయినా ఈ కరోనా ఆంక్షలు మనల్ని వీడి పోవడం లేదు. ఏదీ పట్టాలెక్కడం లేదు. క్రీడలు నిర్వహించడం అయితే తలకు మించిన భారం అవుతోంది.ఐపీఎల్ నిర్వహించినా మధ్యలో ఆటగాళ్లు కరోనా బారిన పడి అది కాస్తా మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళితే అక్కడ గదుల్లో ఒంటరిగా ఉంచి కఠిన క్వారంటైన్ విధిస్తున్నాడు. ఓ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 2, 2021 / 01:00 PM IST
    Follow us on

    కరోనా చేయబట్టి ప్రశాంతంగా ఒకరినొకరు మాస్కులు లేకుండా కలుసుకోలేని పరిస్థితి. మొదటి వేవ్ పోయింది.. రెండో వేవ్ పోయింది. అయినా ఈ కరోనా ఆంక్షలు మనల్ని వీడి పోవడం లేదు. ఏదీ పట్టాలెక్కడం లేదు. క్రీడలు నిర్వహించడం అయితే తలకు మించిన భారం అవుతోంది.ఐపీఎల్ నిర్వహించినా మధ్యలో ఆటగాళ్లు కరోనా బారిన పడి అది కాస్తా మధ్యలోనే ఆగిపోయింది.

    ఇప్పుడు ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళితే అక్కడ గదుల్లో ఒంటరిగా ఉంచి కఠిన క్వారంటైన్ విధిస్తున్నాడు. ఓ వారం ఉన్నాక అందరికీ రక్తపరీక్షలు చేసి కరోనా లేదని తేలితేనే ఆడిస్తున్నారు. లేదంటే మ్యాచ్ లో అవకాశమే లేదు.

    టీమిండియా టెస్ట్ టీం ఇప్పటికే ఇంగ్లండ్ వెళ్లిపోయింది. అక్కడ క్వారంటైన్ పూర్తి చేసి న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడి ఓడింది. ఇక టీమిండియా యంగ్ టీం శ్రీలంకకు వెళ్లింది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని యువ టీం శ్రీలంకతో జులై 13 నుంచి 3 వన్డేలు, 3 టీట్వంటీలు ఆడనుంది. రాహుల్ ద్రావిడ్ దీనికి కోచ్. తొలి సారి టీమిండియా రెండు టీంలు వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా తలపడుతున్నాయి.

    ఇక కఠిన క్వారంటైన్ ను ముగించుకున్న యువ టీమిండియా ఆటగాళ్లు ఈరోజు సేదతీరారు. ఈత కొలనులో సేదతీరారు. వినూత్నమైన ఆటలు ఆడారు. కఠిన క్వారంటైన్ తర్వాత ఊపిరి వచ్చిన పక్షుల్లా ఎగిరారు.

    జట్టులో ఆటగాళ్ల మధ్య బంధం పెంచేందుకు బీసీసీఐ వారితో ఉల్లాసవంతమైన క్రీడలు ఆడించింది. స్విమ్మింగ్ ఫూల్ లో అందరినీ ఈత కొట్టించి వారితో పలు ఆటలు ఆడించింది. ఆ ఫొటోలు బీసీసీఐ ట్వీట్ చేయగా వైరల్ అయ్యాయి.

    https://twitter.com/surya_14kumar/status/1410591426325336068?s=20