https://oktelugu.com/

నో కామెంట్..! రేవంత్ కే జై..!!

  తీవ్రమైన పోటీ మధ్య పీసీపీ పదవి వరించిన రేవంత్ రెడ్డి.. ఆ పోస్టును కాపాడుకునేందుకు ఇప్పటి నుంచే అందరిని కలుపుకుపోతున్నాడు. అసంతృప్తి, సీనియర్ నాయకులను కలుస్తున్న రేవంత్ రెడ్డి వారి మన్ననలను పొందేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు.అటు రేవంత్ రెడ్డికి పదవి దక్కడంపై రాష్ట్రంలోని పలువురు నేతలు ఆయన ఇంటికి జాతరలా వస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు రేవంత్ రెడ్డిపై కామెంట్లు చేసిన వారు..చేయాల్సిన వారు సైలెంట్ అయిపోయారు. ఎవరూ ఒక్క మాట కూడ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 2, 2021 / 01:38 PM IST
    Follow us on

     

    తీవ్రమైన పోటీ మధ్య పీసీపీ పదవి వరించిన రేవంత్ రెడ్డి.. ఆ పోస్టును కాపాడుకునేందుకు ఇప్పటి నుంచే అందరిని కలుపుకుపోతున్నాడు. అసంతృప్తి, సీనియర్ నాయకులను కలుస్తున్న రేవంత్ రెడ్డి వారి మన్ననలను పొందేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు.అటు రేవంత్ రెడ్డికి పదవి దక్కడంపై రాష్ట్రంలోని పలువురు నేతలు ఆయన ఇంటికి జాతరలా వస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు రేవంత్ రెడ్డిపై కామెంట్లు చేసిన వారు..చేయాల్సిన వారు సైలెంట్ అయిపోయారు. ఎవరూ ఒక్క మాట కూడ ఎత్తకపోవడం గమనార్హం.

    ఆర్నెళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరనేదీ సస్పెన్స్ గా కొనసాగింది. ఈ పోస్టును దక్కించుకునేందుకు ఎంపీ కోమటి రెడ్డితో పాటు కొందరు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఏకంగా ఢిల్లీ వెళ్లి లాబియింగ్ నడిపినట్లు సమాచారం. అయితే అధిష్టానం రేవంత్ రెడ్డి పేరు ప్రకటించిన తరువాత పీసీసీ పోస్టులను అమ్ముకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అధిష్టానం సీరియస్ కావడంతోపాటు రేవంత్ రెడ్డి కూడా పార్టీ గురించి చీఫ్ గా మాట్లాడొద్దని సున్నితంగా హెచ్చరించారు.

    దీంతో ఎంపీ వెంకటరెడ్డి తాను ఇక ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పాడు. మరోవైపు రేవంత్ రెడ్డి తనపై అసంతృప్తిగా ఉన్న విహెచ్ హనుమంతరావు ఆసుపత్రిలో ఉండగా స్వయంగా వెళ్లి కలిశారు. అటు టీఆర్ఎస్ లోకి వెళ్తాడని ప్రచారం జరుగుతున్న పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్లి మరీ పలకరించారు. ఇలా అసంతృప్తి, సీనియర్ నేతలను రేవంత్ రెడ్డి స్వయంగా కలుసుకోని వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు. ఇక తనకు పీసీసీ చీఫ్ ఇచ్చినందుక థ్యాంక్యూ చెప్పడానికి ఢిల్లీ వెళ్లారు రేవంత్. దీంతో ఆయనకు మరింత బలం చేకూరినట్లయింది.

    ఈ పరిణామాల మధ్య పీసీపీ పదవి రేవంత్ రెడ్డికి దక్కడంపై మరికొంతమంది అసంతృప్తిగా ఉన్నవారు సైతం సైలెంట్ అయిపోయారు. రోజురోజుకు రేవంత్ కు మద్దతు పెరిగిపోతుండడంతో పాటు హైకమాండ్ నుంచి గట్టి మద్దతు ఉండడంతో నాయకులెవరు కామెంట్లు చేయడం లేదు. దీంతో చేసేదేమీ లేక రేవంత్ కు అనుకూలంగా వెళ్లక తప్పదని అనుకుంటున్నారు.