Panjob Elections: పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను ఓడించి ఠీవీగా నిలబడింది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ సునామీలో మాజీ సీఎంలు, ప్రస్తుత సీఎం సహా ఎంతో మంది దిగ్గజ నాయకులు కొట్టుకుపోయారు. ఇక వారిని ఓడించింది ఎవరో బిగ్ షాట్స్ కాదు.. కేవలం మహిళా వాలంటీర్లు, గుమస్తాలు, షాపుల్లో పనిచేసే ఆమ్ ఆద్మీ సామాన్య నేతలే కావడం విశేషం.

పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సామాన్యులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. దిగ్గజ నేతలను ఓడగొట్టారు. ప్రజలు డబ్బుకు దాసోహం కాకుండా నీట్ పాలిటిక్స్ చేసే ఆమ్ ఆద్మీ పార్టీని ఓన్ చేసుకొని గెలిపించారు.
మొత్తం 117 సీట్లున్న పంజాబ్ లో ఆప్ ఏకంగా 91 స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. పంజాబ్ ఎన్నికల్లో సీఎంలుగా చేసిన బాదల్, చన్నీ, కెప్టెన్ కూడా ఆమ్ ఆద్మీ ధాటికి ఓడిపోయారు. సీఎం చరణ్ జీత్ చన్నీ సింగ్ ను ఓడించింది మొబైల్ రిపేర్ దుకాణంలో చిన్న పనిచేస్తున్న ఓ వ్యక్తి కావడం సంచలనమైంది. ఇక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ సిద్దూను ఓడించిన వ్యక్తి ఒక మహిళా వాలంటీర్.. ఆమ్ ఆద్మీ ప్రభంజనంలో వారంతా సామాన్యుల చేతుల్లో కొట్టుకుపోయారు.
అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలే అత్యంత పేదవారే కాదు.. అత్యంత ధనవంతులైన నేతలు కూడా పోటీచేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ధనవంతుడైన అభ్యర్థిగా కులవంత్ సింగ్ నిలిచారు. ఆమ్ ఆద్మీ తరుఫున పోటీచేసిన ఈ ధనవంతుడి సంపద విలువ ఏకంగా రూ.238 కోట్లు కావడం విశేషం. ఇతడే పంజాబ్ లో పోటీచేసిన వారిలో అత్యంత ధనవంతుడు. సాస్ నగర్ అసెంబ్లీ సీటునుంచి పోటీచేసిన కుల్వంత్ సింగ్ కాంగ్రెస్ అభ్యర్థి బల్బీర్ సింగ్ సిద్దూను 34097 ఓట్ల తేడాతో ఓడించారు.
ఇక పంజాబ్ లో పోటీచేసిన అభ్యర్థుల్లో రెండో అత్యంత సంపన్న వ్యక్తి మాజీ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్. ఈయన సంపద విలువ రూ.202 కోట్లు. జలాలబాద్ నుంచి కాంగ్రెస్ తరుఫున పోటీచేసిన ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి జగదీప్ కమ్ బోజ్ చేతిలో 30930 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన కరన్ కౌర్ మూడో అత్యంత ధనవంతురాలు.. ఈమెకూడా ముక్త్ సర్ నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు.