‘2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా బీజేపీకి వచ్చిన ఓటు బ్యాంకు శాతం దాదాపు 0.96శాతం. అంటే కనీసం 1 శాతం కూడా ఓట్లు రాని బీజేపీ 2024లో అధికారంలోకి వస్తుందా? కొత్తగా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో బలమైన వైసీపీ, టీడీపీలను తోసి బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే సత్తా సోము వీర్రాజులో ఉందో లేదో తెలుసుకుందాం..’
Also Read: అమరావతి ప్రజలకు షాక్ ఇచ్చేలా జగన్ బంపర్ ఆఫర్…!
ప్రస్తుతం సీఎం, వైసీపీ అధినేత జగన్ బలంగా ఉన్నారు. ఆయన ధాటికి తరతరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న కమ్మ సామాజికవర్గం కకావికలం అవుతోంది. కమ్మనేతలు, టీడీపీ నేతలు భారీగా పెట్టుబడి పెట్టిన అమరావతి సౌధాన్ని కూల్చి విశాఖకు వెళుతున్న జగన్ వల్ల కమ్మ వారి వ్యాపారాలు, బలమైన మీడియా దారుణంగా దెబ్బతింది. కరోనాతో మునుపెన్నడూ లేని విధంగా టీడీపీ మీడియా కుదేలైంది. ఇన్ని ఉపద్రవాల మధ్య వయోభారంతో టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో ఆ పసుపు పార్టీ నిలబడలేకపోతోంది. దీంతో వైసీపీని ఎదుర్కొనే బలం.. బలగం టీడీపీకి లేకుండా పోతోందన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఇంతటి బలమైన వైసీపీని ఢీకొట్టే సత్తా ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రమే ఉందా? అంటే రాజకీయాలు కలిసివస్తే ఏదైనా సాధ్యం కావచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం సీఎం జగన్ మెడ చుట్టూ కేసులున్నాయి. ఈడీ,సీబీఐ చేతిలోనే అవి ఉన్నాయి. దీంతో సోము వీర్రాజు ఇటీవల ఓ చానెల్ తో మాట్లాడుతూ.. ‘తమకు టీడీపీ, వైసీపీ రెండు కళ్లు.. రెండు తమకు ఏపీలో శత్రువులే.. ఏదీ తమకు దగ్గరిది కాదు.. తాము మూడో కన్ను తెరిస్తే ఖచ్చితంగా ఏపీలో అధికారంలోకి వస్తాం’ అని వివరించారు. దీన్ని బట్టి ఆయన మూడోకన్ను చంద్రబాబు, వైసీపీ బలహీనతలే అని అర్థం చేసుకోక తప్పదు.
ఏపీలో టీడీపీపై నేతల్లోనూ.. ప్రజల్లోనూ నమ్మకం సడలుతోంది. అందరూ వైసీపీ, బీజేపీ వైపు చూస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంపై అపోహలు పెరుగుతున్నాయి. ఆయన పుత్రరత్నం లోకేష్ బాబు శక్తిసామర్థ్యాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిందని ఆ పార్టీ నేతలే అంటున్నారు.ఈ క్రమంలోనే వైసీపీ అంటే పడని వారి చూపు ఇప్పుడు మొత్తం బీజేపీ వైపే ఉంది. జనసేనాని పవన్ పార్ట్ టైం పాలిటిక్స్ పై ఎవరికీ నమ్మకం లేదు. సో ఏపీలో వైసీపీకి ప్రత్యామ్మాయం బీజేపీనే కనిపిస్తోంది.
Also Read: ‘జగన్ గారూ… మనం వరస్ట్?’ అటగా..!
ఇక కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడుగా వెళ్తున్నారు. అటు పార్టీలో టీడీపీ వంత పాడేవారిని సస్పెండ్ చేస్తూనే.. ఇటు పార్టీని బలంగా తయారు చేసేందుకు కాపు నేతలను ఒక్కటి చేస్తున్నారు. బీజేపీలో ఉన్న టీడీపీ సానుభూతి పరుల నోళ్లు మూయిస్తున్నారు. ఇన్నాళ్లుగా పడిన బీజేపీపై టీడీపీ ముద్ర లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను కలిసి ఏకతాటిపైకి తెచ్చాడు. తాజాగా ముద్రగడ, మాజీ జేడీ లక్ష్మీనారాయణతో భేటికి నిర్ణయించారని తెలిసింది. ఇలా అందరూ కాపు, దిగ్గజ నేతలను ఒక్కతాటిపైకి తెచ్చి మూడో ప్రత్యామ్మాయంను ఏపీలో తీసుకొచ్చి అధికారమే లక్ష్యంగా సోము వీర్రాజు ముందుకెళ్తున్నారు.
బీజేపీ ముందర ఇప్పుడు కేంద్రంలో అధికారమే బలంగా ఉంది. మంచి నాయకత్వం ఉంది. జగన్, చంద్రబాబుల మెడకు కేసుల ఉచ్చులు ఉండడం ఆ నేతలకు మైనస్ గా మారింది. రాబోయే ఎన్నికల నాటికి బీజేపీ బలపడాలని చూస్తోంది. ఈ క్రమంలోనే జగన్, చంద్రబాబులను సైడ్ చేయడం పెద్ద విషయం కాదు. అదే సమయంలో ఓటు బ్యాంకును 0 నుంచి పెంచుకోవడం బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ముందున్న అసలు సవాల్. ముఖ్యంగా బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులను ఒక్కతాటిపైకి తేవడం.. టీడీపీకి దూరమైన బీసీలను కలుపుకోవడం.. యువ నాయకత్వం.. కొత్త వారికి అవకాశాలు ఇస్తే బీజేపీ ఏపీలో నిలబడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మతతత్వ, హిందుత్వ భావజాలం లేని ఏపీలో బీజేపీ ఎదుగుదల అంటే కొద్దిగా కష్టమన్న భావన ఉంది. ఉత్తరాధితో పోలిస్తే ఏపీలో ఆ సెంటిమెంట్ వర్కవుట్ కాదు. సాంఘిక పరిస్థితులు ఏపీలో ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అందుకే అభివృద్ధి , అసమానతలు తొలగింపే లక్ష్యంగా సోమువీర్రాజు ముందుకెళుతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Also Read:ఇంతకీ ఆ గుమ్మడికాయల దొంగ ఎవరు నాగబాబు…?
ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, తీరప్రాంతం సహా రైతాంగం.. అభివృద్ధి విషయంలో తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని సోము వీర్రాజు పేర్కొన్నారు. పైగా కుటుంబ పాలనకు అతీతంగా ఏపీలో బీజేపీ మాత్రమే ఉందన్న ఆయన వాదన సరైందే. ఈ నేపథ్యంలోనే ఇన్ని అంశాలు మేళవింపుగా సోము వీర్రాజు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ఇక అంతిమంగా ఏపీలో బీజేపీ-జనసేన కలిసి పోటీచేయబోతున్నాయి. దీనికి ముద్రగడ, జేడీ లక్ష్మీనారాయణ సహా పలువురు కీలక నేతల మద్దతు కూడగడితే సోము వీర్రాజు అధికార లక్ష్యం నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు అకుంఠిత దీక్ష, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం అవసరం. ఈ క్రమంలోనే ఆ దిశగా సోము వీర్రాజు ఎంత వరకు సక్సెస్ అవుతాడన్నది వేచిచూస్తూ.. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న సోము వీర్రాజుకు ఆల్ ది బెస్ట్ చెబుదాం..
-నరేశ్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: What are the challenges ahead of somu veerraju
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com