నూతన్ నాయుడు.. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన విశాఖ వాసి. ఆ తరువాత సినీ ఇండస్ట్రీతో పరిచయం పెంచుకొని ఇటీవలే ఆయన దర్శకత్వంలో ‘పరాన్నజీవి’ అనే సినిమాను తెరకెక్కించాడు. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఆయన భార్య ఒక దళిత యువకుడికి గుండు కొట్టించిన వైనం చర్చనీయాంశమైంది.
అయితే సామాన్యుడిగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాక పాపులర్ అయిన నూతన్ నాయుడు ఇంత లగ్జరీ లైఫ్ వెనుక అతడు చేస్తున్న వ్యాపారాలు ఏమిటీ? అతడు ఏదైనా రహస్యం దాచుస్తున్నాడా అన్న అనుమానాలు లేకపోలేదు.
నూతన్ నాయుడు ఇంట్లో అంతమంది సేవకులు కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐదుగురు పనివాళ్లు, ఒక బ్యూటీషియన్ ఇంకా ఒకరిద్దరు వంటవారు కనిపించారని ప్రచారం జరుగుతోంది.
తాజాగా నూతన్ నాయుడు వ్యాపారాల వెనుక రహస్యాలను బయటపెట్టడానికి పోలీసులు ప్రతీ ఒక్కరిని విచారణ జరుపుతున్నారని సమాచారం. నూతన్ నాయుడు భారీగా వ్యక్తిగత అంగరక్షకులతో కట్టుదిట్టమైన భద్రతతో విశాఖలో పర్యటిస్తాడని అక్కడ టాక్ ఉంది. నూతన్ నాయుడు నిజమైన వ్యాపారం ఏంటనేది ఆసక్తిగా మారింది.
అయితే నూతన్ వెనుక ఒక బిగ్ షాట్ ఉన్నాడని.. ఆ రాజకీయనేతకు నూతన్ బినామీగా ఉన్నాడనే ప్రచారం వైజాగ్ లో సాగుతోంది. అయితే పోలీసుల విచారణలో ఇవి నెగ్గుతేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇదంతా ప్రచారంగానే చెబుతున్నారు.