Homeజాతీయ వార్తలుWhat A Sensation That KCR Says: కేసీఆర్ చెప్పే ఆ సంచలనం ఏమిటి?

What A Sensation That KCR Says: కేసీఆర్ చెప్పే ఆ సంచలనం ఏమిటి?

What A Sensation That KCR Says: బీజేపీతో ప్రత్యక్ష పోరాటానికి టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. మూడో కూటమి ప్రయత్నాల్లో భాగంగా ఉత్తరాది రాష్ట్రాల నేతలతో మంతనాలు జరుపుతున్న కేసీఆర్ వ్యూహాలు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే రాష్ర్టపతి ఎన్నికల్లో తమదైన సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇందుకోసం బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలపాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పలు పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై స్పష్టత ఇవ్వాలని చూస్తున్నారు. దీని కోసమే ఆయన పర్యటనలు చేస్తున్నట్లు సమాచారం.

What A Sensation That KCR Says
KCR

కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే దానిపై కసరత్తు చేస్తన్నారు. సమర్థుడైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు. అంతా పరిశీలిస్తే ఆయనకు ఒకే ఒక్కరు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనే అన్నాహజరారే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో లోక్ పాల్ బిల్లు ప్రవేశపెట్టాలని పోరాటం చేసి దేశాన్ని ఆకర్షించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ సైతం ఆయనతో జతకట్టిన వారే కావడం గమనార్హం. దీంతో అన్నాహజారే పేరు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

Also Read: Ashu Reddy: అషు రెడ్డి వీడియో పై ట్రోల్స్.. ఆ కామెంట్స్ దారుణం !

ఈ సారి రాష్ర్రపతి ఎన్నికల్లో ఆయనను పోటీకి దింపాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. స్వచ్చంధ పోరాటంతో దేశం దృష్టిని మరల్చిన మహోన్నత వ్యక్తిగా అభివర్ణించారు. ఆయన స్వగ్రామం మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి కావడంతో కేసీఆర్ ఆయన ఇంటకి వెళ్లి ఆయనను సాదరంగా ఆహ్వానించి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ బీజేపీపై కయ్యానికే కాలు దువ్తుతున్నట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు ఏదో తూతూ మంత్రంగా సాగిన ఆయన వ్యవహారం కాస్త ఘాటుగా మారుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

బీజేపీని ఎదిరించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు పార్టీ వర్గాలు బావిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల సీఎంలతో సమావేశమైన కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్ వంటి వారిని తమ వెంట ఉంచుకుంటున్నారు. ఉత్తరాదిలో పట్టు సాధించాలని పావులు కదుపుతున్నారు. అందుకే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి ధీటుా అన్నాహజారేను పోటీలో ఉంచాలని తలపిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Meera Jasmine: లేటు వయసులో సెగలు పుట్టిస్తున్న మీరా జాస్మిన్ !

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular