పట్టుదల.. మొండి పట్టుదల ఎవరిది గెలుపు?

పశ్చిమ బెంగాల్‌లో మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఎన్నిక వేడి మొదలైంది. 292 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో.. ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఫైనల్‌గా మే 2వ తేదీన ఎవరిది గెలుపు.. ఎవరిది సీఎం పీఠం అనేది స్పష్టం కానుంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమత బెనర్జీ పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా ఈసారి బెంగాల్‌లో కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ అంతే పట్టుదలతో ఉంది. ఈ […]

Written By: Srinivas, Updated On : March 11, 2021 11:27 am
Follow us on


పశ్చిమ బెంగాల్‌లో మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో ఎన్నిక వేడి మొదలైంది. 292 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో.. ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఫైనల్‌గా మే 2వ తేదీన ఎవరిది గెలుపు.. ఎవరిది సీఎం పీఠం అనేది స్పష్టం కానుంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమత బెనర్జీ పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా ఈసారి బెంగాల్‌లో కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ అంతే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఎవరిది గెలుపు అన్నది ఉత్కంఠగా మారింది.

Also Read: వ్యతిరేక పవనాలు.. జమిలీ ఎన్నికలకు మోడీ బ్రేక్

కానీ.. రెండు పార్టీల్లో మాత్రం అధికారం తమదేనంటే తమదేననే ఆశ మాత్రం ఒకటి కనిపిస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన స్థానాలను బట్టి బీజేపీ పశ్చిమ బెంగాల్ ను ఎలాగైనా చేజిక్కించుకుంటామని బీజేపీ విశ్వాసంతో ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో 40 శాతం ఓట్లను బీజేపీ సాధించింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలను పార్టీలోకి చేర్చుకుని బీజేపీ బలం పెంచుకునే ప్రయత్నం చేసింది. సువేందు అధికారి, రాజీవ్ బెనర్జీ లాంటి కీలక నేతలు పార్టీ మారడంతో తమ బలం పెరిగిందని బీజేపీ భావిస్తోంది.

మరోవైపు.. మమత బెనర్జీ సైతం సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు వేరు.. అసెంబ్లీ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజలు స్థానికతను చూస్తారు. అందుకే.. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచినంత సులువు కాదని మమత బెనర్జీ భావిస్తున్నారు. అందుకే స్థానికతకే అవకాశం ఇవ్వాలని, గుజరాతి పార్టీకి రాష్ట్రంలో కాలుమోపనీయ వద్దంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు.. ముస్లిం ఓట్లు చీలకుండా మమత బెనర్జీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

మైనారిటీలు మొన్నటి వరకూ మమత బెనర్జీ వెంటే ఉన్నారు. అయితే.. ఈసారి ముస్లిం పార్టీలు పోటీ చేస్తుండంతో వారి వైపు మొగ్గు చూపుతారన్న చర్చ జరుగుతోంది. అందుకే మమత బెనర్జీ ముస్లిం ఓటు బ్యాంకుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారి ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెంగాలీలు తన వైపే ఉంటారని మమత ధీమాతో ఉన్నారు. ఫైనల్‌గా ఈ ఎన్నికల్లో మమత బెనర్జీ, బీజేపీలు ఎవరికి వారే గెలుపు అన్నట్లు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. చివరి మజిలీలో గెలుపు ఎవరిదో ఫలితాలు వస్తే కానీ తెలిసేలా లేవు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్