West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, తృణమూల్ మధ్య తీవ్ర పోరాటంగా మారాయి. ముస్లిం ఓట్లు కొన్ని సీట్లలో కీలకమైనా, మెజారిటీ స్థానాల్లో హిందూ ఓటర్లే గెలుపునిర్ణయకాలు. ఏప్రిల్ 22, 29 తేదీల్లో మొదటి రెండు దఫాల పోలింగ్ ఫలితాల దిశను సూచిస్తాయి. బెంగల్‌లో గెలుపు ఓటములను నిర్ణయించేంది ముస్లింలు కాదు. చాలా మంది ముస్లిం ఓట్ల కారణంగానే అధికారం దక్కుతుందని అనుకుంటారు. ఈసారి గెలుపోటములను నిర్ణయించేంది హిందువులే. 70–75 సీట్లలో ముస్లింలు బలంగా ఉన్నారు. అక్కడ ముస్లింలే నిర్ణేతలు కానీ, మెజారిటీ సీట్లలో హిందువులే ఉన్నారు.
2021 ఎన్నికల ఫలితాలు ఇలా..
బీజేపీ 38.13% ఓట్లతో 77 సీట్లు సాధించింది, ముస్లిం మద్దతు లేకుండా ఈ బలం పెరిగింది. 50–55 సీట్లలో తక్కువ మెజారిటీలతో గెలిచారు: 7 సీట్లు 1000 ఓట్ల లోపు (దీన్‌హటా 57, బలరాంపూర్ 423, దాంతన్ 623, తామ్‌లుక్ 793, జల్పాయ్‌గూడ 941, కుల్టీ 679). మరో 22 సీట్లు 5 వేలలోపు మెజారిటీతో బీజేపీ గెలిచింది. ఇక తృణమూల్ 13 సీట్లు 5 వేలలోపు మెజారిటీతో నెగ్గింది. 10 వేలలోపు మెజారిటీతో 30 సీట్లు గెలిచింది. ఈ సన్నని మార్జిన్లు ఈసారి మలుపు తిరగవచ్చు.
హిందువులే మెజారిటీ..
రాష్ట్రంలో హిందువులు 65–70 శాతం, ముస్లింలు 27–33 శాతం ఉన్నారు. 70–75 సీట్లలో ముస్లింలు బలం ఉంది. కానీ మెజారిటీ సీట్లలో హిందూ ఓట్లే నిర్ణయం. బీజేపీ ఓట్లు 10.66 నుంచి 38.13కి పెరిగాయి. ఈసారి 6–7 శాతం మరింత పెరిగితే 90+ సీట్లు సాధ్యం. తృణమూల్ ముస్లిం ఓట్లపై (57.6 శాతం మద్దతు) ఆధారపడుతోంది.
నాలుగు కీలక అంశాలు..
ఈసారి సర్ నిర్వహించడంతో బెంగాల్‌లో 70–80 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి, తృణమూల్ మెజారిటీ ఓటర్లకు దెబ్బ (బీజేపీ, టీఎంసీ రెండింటి ఓటర్లు ప్రభావితులు). మమతా ప్రభుత్వం కేంద్ర పథకాలు నిలిపివేసింది. ఈ విషయాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లడం ద్వారా బీజేపీ ప్రభావం చేయగలుగుతుంది. తాము అధికారంలోకి వస్తే అందించే పథకాలు కూడా వివరించాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, మజ్లిస్, కబీర్ పార్టీలు మైనారిటీ ఓట్లను విభజిస్తే టీఎంసీకి నష్టం జరుగుతుంది. పది సీట్ల వరకు తగ్గిపోతాయి.
మొత్తంగా హిందువులే బెంగాల్‌లో అధికారం ఎవరితో నిర్ణయిస్తారు. హిందువులను బీజేపీ ఏమేరకు తమవైపు తప్పుకుంటుంది అనేది బీజేపీ గెలుపుపై ఆధారపడి ఉంటుంది. ముస్లిం ఓట్లు ఉత్తరప్రదేశ్, అస్సాం, బీహార్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఈసారి బెంగాల్‌లో కూడా అలాంటి పరిస్థితి ఉంది.