https://oktelugu.com/

తెలంగాణలో మరోసారి తెరపైకి ఉద్యోగాలు..

తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వం నుంచి వరాలు కురుస్తాయని ప్రజలకు బాగా అర్థమైపోయింది. దుబ్బాక ఉప ఎన్నిక నుంచి నేటి హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకు సీఎం కేసీఆర్ ఎన్నోప్రకటనలు చేశారు. వాటిలో కొన్నింటిని మాత్రమే పరిష్కరించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ సమయంలో తెరపైకి తెచ్చారు. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. అయితే ఆ తరువాత వాటి ఊసేలేదు. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : July 2, 2021 8:40 am
    Follow us on

    తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వం నుంచి వరాలు కురుస్తాయని ప్రజలకు బాగా అర్థమైపోయింది. దుబ్బాక ఉప ఎన్నిక నుంచి నేటి హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకు సీఎం కేసీఆర్ ఎన్నోప్రకటనలు చేశారు. వాటిలో కొన్నింటిని మాత్రమే పరిష్కరించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ సమయంలో తెరపైకి తెచ్చారు. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. అయితే ఆ తరువాత వాటి ఊసేలేదు. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది.

    అయితే ఈసారి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు స్థానికులకు ఉద్యోగాలు దక్కాలంటే జోనల్ వ్యవస్థ సమస్య ఉందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే కేంద్రం జోనల్ విధానానికి ఆమోదం తెలిపింది. దీంతో రెండువేల గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పోలీస్ ఉద్యోగాల తప్ప గ్రూప్స్ నోటిఫికేషర్ రాలేదు. దీంతో గ్రూప్ వన్ పోస్టులు వేసే అవకాశం ఉందని చర్చంచుకుంటున్నారు.

    అయితే యువతలో మాత్రం నిరాశ అలాగే ఉందని అంటున్నారు. గతంలో 50 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని కేటీఆర్ కూడా ప్రకటించడంతో కొంత ఆశ ఉండేది. కానీ ఆ ఎన్నికలు గడిచి సంవత్సరం గడుస్తున్నా పట్టించుకోలేదు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా వాటిని ప్రకటించేందుకు రెడీ కావడంతో యువత కాస్త నిరాశగానే ఉంది. ఎందుకంటే కేసీఆర్ ప్రకటించడం ఆ తరువాత వాటిని పట్టించుకోకపోవడం చూస్తూనే ఉన్నామని చాలా మంది అంటున్నారు.

    ఇదిలా ఉండగా ఉద్యోగాల భర్తి విషయాన్న ప్రభుత్వం మీడియాకు అనధికార సంకేతాలు ఇస్తోంది. మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రచారం చేయిస్తే కొంత లాభం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటికే ఎన్నో హామీలిచ్చిన కేసీఆర్ ఆ తరువాత వాటి గురించి మరిచిపోతారని అంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో యువత తీవ్ర నిరాశతో ఉన్నారు. మరి ఈసారి కేసీఆర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడోనన్న ఆసక్తి నెలకొంది.