కంచె చేను మేస్తే అనే సామెత మనం వినే ఉంటాం. 2014 – 2019 మధ్య నవ్యాంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ చేసిన అవినీతికి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఐదేళ్ల పాలనాకాలంలో చిన్నస్థాయి కార్యకర్తల నుంచి పెద్దస్థాయి నేతల వరకు టీడీపీ నేతలు చేసిన అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చంద్రబాబు సైతం నేతల అవినీతి విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరించాడనేది బహిరంగ రహస్యం.
Also Read : మరణించినా ‘కోడెల’ను వదలవా జగన్?
టీడీపీ తమ పార్టీకి అనుకూలంగా ఉండే నేతలు, సన్నిహితులు భూములు కొనుగోలు చేసిన తరువాతే రాజధానిని ప్రకటించిందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. వైసీపీ టీడీపీ రాజధాని విషయంలో చేసిన అవినీతిని ఇన్ సైడర్ ట్రేడింగ్ తో పోలుస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి టీడీపీ గత ఐదేళ్లలో చేసిన అక్రమాల గురించి దర్యాప్తు చేపట్టింది.
అయితే అమరావతిలో జరిగిన అవినీతిని చూసి వైసీపీ కళ్లు బైర్లు కమ్మాయని తెలుస్తోంది. టీడీపీ హయాంలో ఏజీగా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈయన బంధువుల ద్వారా భారీగా భూములు కొనుగోలు చేశారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా దమ్మాలపాటి శ్రీనివాస్ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించడంతో అమరావతిలో అంత అవినీతి జరిగిందా…? అనే చర్చ జరుతోంది.
టీడీపీ తమ హయాంలో అవినీతి జరగలేదని చెబుతున్నా అవినీతి జరిగిందనే మాట వాస్తవం. గతంలో టీడీపీలో ఉన్న వైసీపీ నేతలు కూడా ఈ నిర్ణయం ద్వారా లబ్ధి పొందారు. అయితే అమరావతిలో అవినీతికి సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి రావాలంటే ఇంకెంత కాలం ఆగాలో.
Also Read : అమరావతి భూకుంభకోణం కేసులో ఏసీబీ దూకుడు… ఆ ఎమ్మెల్యేలకు షాక్….?