తెలంగాణలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు వాడివాడీగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు.. ప్రభుత్వా ఆస్పతుల్లో సదుపాయాలు.. కొత్త రెవిన్యూ చట్టంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. రెండ్రోజులపాటు అసెంబ్లీలో చర్చించిన అనంతరం కొత్త రెవిన్యూ యాక్ట్ కు సభ ఆమోదం తెలిపిన సంగతి తెల్సిందే. కాగా నేడు కేంద్రం ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న కొత్త విద్యుత్ చట్టంపై వాడివేడీగా చర్చ జరుగుతోంది.
Also Read: రవిప్రకాష్ చేతిలోకి టీవీ9 వెళ్లదు.. ఎందుకంటే?
దీనిపై సీఎం కేసీఆర్ తనదైన శైలిలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం తీసుకొత్త కొత్త విద్యుత్ చట్టం లోపభూయిష్టంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ రంగం రాష్ట్ర పరిధిలో ఉందని.. కేంద్రం తీసుకొచ్చే కొత్త చట్టం ద్వారా అధికారాన్ని ఢిల్లీకి వెళ్తాయన్నారు. విద్యుత్ రంగం రాష్ట్రాల వద్ద ఉంటేనే డిస్కంలు.. ట్రాన్స్ కో.. జెన్ కోలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. విద్యుత్ రంగంపై కేంద్రం కొత్త చట్టం తీసుకు రావద్దని కోరారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి ఎక్కువయ్యే అవకాశం ఉందని తెలిపారు. కొత్త చట్టంలో అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని… ప్రతీ బోరుకు మీటర్ పెట్టాలని నిబంధన ఉందన్నారు. దీని వల్ల రాష్ట్రంలోని 26లక్షల బోర్లకు మీటర్లు పెట్టాల్సి వస్తుందని.. దీనికి రూ.700కోట్ల ఖర్చు ప్రభుత్వంపై పడుతుందన్నారు. మీటర్ రీడింగును బట్టి రైతుల నుంచి బిల్లులను ముక్కుపిండి కేంద్రం వసూలు చేస్తుందన్నారు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు.
Also Read: హైదరాబాద్ కు మహర్ధశ
కేంద్రం తీసుకొచ్చే కొత్త చట్టం సమాఖ్య స్ఫూర్తికి.. రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాలారాసేలా ఉందన్నారు. కేంద్రం తీసుకురానున్న కొత్త విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకులు లాక్డౌన్లో మూడునెలల బిల్లులు ఒకేసారి ఇవ్వడంతో వేలల్లో బిల్లు వచ్చాయన్నారు. దీంతో వినియోగదారులు నష్టపోవాల్సి వచ్చిందని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ విద్యుత్ బిల్లుల సమస్యను పరిష్కానని హామీ ఇచ్చారు.