అదిరిపోయే ‘పాట’ పాడుతున్న మహేష్?

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకెళుతున్నాడు. గత సంక్రాంతి బరిలో సరిలేరునికెవ్వరుతో బరిలోకి దిగి బ్లాక్ బస్టర్ హిట్టుందుకున్నాడు. అంతకముందే శ్రీమంతుడు.. భరత్ అనే నేను మూవీలతో మంచి విజయాలు అందుకున్న సంగతి తెల్సిందే. అనిల్ రావుపూడి-మహేష్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ 200కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అమెరికాలోనూ ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి ఓవర్ సీడ్స్ లో మహేష్ సత్తాను మరోసారి నిరూపించింది. Also Read: […]

Written By: NARESH, Updated On : September 15, 2020 3:55 pm
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకెళుతున్నాడు. గత సంక్రాంతి బరిలో సరిలేరునికెవ్వరుతో బరిలోకి దిగి బ్లాక్ బస్టర్ హిట్టుందుకున్నాడు. అంతకముందే శ్రీమంతుడు.. భరత్ అనే నేను మూవీలతో మంచి విజయాలు అందుకున్న సంగతి తెల్సిందే. అనిల్ రావుపూడి-మహేష్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ 200కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అమెరికాలోనూ ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి ఓవర్ సీడ్స్ లో మహేష్ సత్తాను మరోసారి నిరూపించింది.

Also Read: నాగబాబూ.. మరీ ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అవసరమా?

ఈ మూవీ తర్వాత మహేష్-వంశీ పైడిపల్లి కాంబినేషన్లో మూవీ వస్తుందని అభిమానులు భావించారు. అయితే వీరి కాంబినేషన్ ఆలస్యం కావడంతో దర్శకుడు పర్శురాం మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సూపర్ కృష్ణ జన్మదినం సందర్భంగా మహేష్ కొత్త మూవీకి సంబంధించిన టైటిల్ ను అనౌన్స్ చేశారు. ‘సర్కారువారి పాట’ తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ షూటింగు ప్రారంభం కాకుండానే అదిరిపోయే బిజినెన్ చేస్తూ వార్తలో నిలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ప్రకటించిన వెంటనే నాన్ థియేటర్స్ హక్కులు అమ్మడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా వచ్చిన డబ్బులతో సినిమాను నిర్మించి లాభాలను ఆర్జిస్తుంటారు. దీనిలో భాగంగా సర్కారువారి పాట నాన్ థియేటర్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్మినట్లు తెలుస్తోంది. డిజిటల్ శాటిలైట్ హక్కులను సుమారు 34కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.14కోట్లకు విక్రయించినట్లు టాక్ విన్పిస్తోంది. అయితే థియేటర్ల

నాన్ థియేటర్స్ హక్కులే కాకుండా ఆడియో.. వీడియో రైట్స్ వంటి కూడా ఉన్నాయి. దీంతో ఈ సినిమా భారీగానే బిజినెస్ చేసే అవకాశం కన్పిస్తుంది. మహేష్ రెమ్యూనరేషన్ కింద నాన్ థియేటర్ హక్కులు తీసుకుంటారనే గాసిప్ ఉంది. దీంతో ఈ సినిమా నాన్ థియేటర్ హక్కులు మహేష్ తీసుకున్నట్లయితే మాత్రం ఆయనకు 50కోట్లకు పైబడే పారితోషకం అందే అవకాశం కన్పిస్తోంది. ఇక కరోనా కారణంగా హీరోలు రెమ్యూనేషన్ తగ్గించుకుంటారనే టాక్ ఉంది.

Also Read: అనుష్కపై జర్నలిస్టు వ్యంగ్యాస్త్రం.. మారుతి స్ట్రాంగ్ కౌంటర్

అయితే మహేష్ సినిమా బిజినెస్ అదిరిపోయేలా చేస్తుండటం ఆయన రెమ్యూనేషన్లో కోత పడకపోవచ్చని టాక్ విన్పిస్తోంది. కరోనాతో దెబ్బతిన్న థియేటర్లు ఇదే రేంజులో మహేష్ మూవీ బిజినెస్ చేస్తాయా? అనేది తేలాల్సి ఉంది. థియేటర్లలో కూడా మంచి బిజినెస్ జరిగితే సినిమా ఇండస్ట్రీపై కరోనా ప్రభావం పెద్దగా లేదని తేలిపోనుంది.