AP Police: సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రభుత్వానికి సమాంతరంగా నడిపిస్తున్నారు. ఈ వ్యవస్థతో ప్రజలకు మరింత దగ్గరైన జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకున్న పనులన్నీంటి చక్కబెడుతున్నారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారనే నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించుకున్నారు.
అయితే ఇటీవల కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక విషయాల్లో తన మాటను వెనక్కి తీసుకుంటుండటం కన్పిస్తోంది. మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గిన సీఎం అదే తరహాలో శాసన మండలి రద్దును కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే ఉద్యోగులకు పీఆర్సీపై ఇచ్చిన హామీ నేటికి అమలు చేయలేదనే విమర్శలు ఉన్నాయి.
ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో పోలీసులకు వీక్ ఆఫ్ తామే ప్రవేశపెడుతున్నట్లుగా ప్రభుత్వం ఆర్భాటం చేసింది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావొస్తున్న నేటికి కూడా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు కావడం లేదని తెలుస్తోంది.
పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కరోనా, సిబ్బది కొరత కారణంగా అమలు చేయకపోతున్నామని హోమంత్రి సుచరిత చెబుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం కొద్దిరోజుల క్రితం వెల్లడించారు. త్వరలోనే పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
అయితే కరోనా ఎంట్రీ రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినడంతో ప్రభుత్వం ఉద్యోగాలను పెద్దగా భర్తీ చేయడం లేదు. ఇక పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేయాలంటే ఆ శాఖలో పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈనేపథ్యం పోలీసులకు వీక్లీ ఆఫ్ అనే అంశం అటెక్కెక్కినట్లే కన్పిస్తుంది.
Also Read: ప్రయాణికులకు షాక్: ఆర్టీసీ చార్జీలు మోత మోగిపోయాయి.. ఎంత పెంచారంటే?
ఈ విషయంలో పోలీసులు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే ప్రయత్నం చేయలేరు. మరోవైపు ప్రభుత్వం మాత్రం పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తామంటూ ప్రచారం చేసుకుంటోంది. దీనిపై పోలీసులు ఏం మాట్లాడలేక సైలెంటుగా ఉన్నారు.
కాగా పోలీసులు సైతం వైసీపీ నేతల్లగా రెచ్చిపోయి మరీ ప్రతిపక్ష టీడీపీ నేతలను రోడ్లపైకి ఉరికించుకుంటూ కొడుతామంటూ ప్రభుత్వానికి బాసటగా స్టేట్ మెంట్స్ చేస్తున్నారు. వీటిని చూసిన ప్రజలు మాత్రం అయ్యో పాపం పోలీసులంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: తప్పెవరిది? వరదసాయం కేంద్రం ముందే ఇచ్చిందట..! జగన్ సర్కార్ ఈ నిధులు ఏం చేసింది..?