https://oktelugu.com/

KCR and Kishan Reddy: కిషన్ రెడ్డిపై కేసీఆర్ విమర్శల్లో మర్మమేమిటి?

KCR and Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య బీజేపీ నేతలపై నోరు పారేసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై దుమ్మెత్తి పోస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై దుర్భాషలాడుతూ అసభ్య పదజాలం వాడటం సంచలనం సృష్టిస్తోంది. తిట్టలో బూతు దండకం అందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉంటూ కేంద్ర మంత్రిపై ఇంతలా రెచ్చిపోవడం బాధాకరమే. కేసీఆర్ భాషపై అందరిలో అయోమయం నెలకొంది. బీజేపీ రాష్ర్ట […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 1, 2021 / 03:35 PM IST
    Follow us on

    KCR and Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య బీజేపీ నేతలపై నోరు పారేసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై దుమ్మెత్తి పోస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై దుర్భాషలాడుతూ అసభ్య పదజాలం వాడటం సంచలనం సృష్టిస్తోంది. తిట్టలో బూతు దండకం అందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉంటూ కేంద్ర మంత్రిపై ఇంతలా రెచ్చిపోవడం బాధాకరమే.

    KCR and Kishan Reddy

    కేసీఆర్ భాషపై అందరిలో అయోమయం నెలకొంది. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ వాడిన భాషపై మండిపడుతున్నారు. కేసీఆర్ కు పిచ్చిపట్టినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజల బాధలను పట్టించుకోవడం మానేసి ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగడం నేతల్లో ఆందోళనకు గురిచేస్తోంది.

    Also Read: కేసీఆర్ టార్గెట్ బీజేపీ.. అసలు కారణం ఇదేనా?

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై విమర్శలకు పాల్పడటంతో బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఇంతలా దిగజారిపోయి మాట్లాడటంతో ఆయనకు ఓటమి భయం పట్టుకుందని తెలుస్తోంది. సీఎం గా ఉండి కూడా దుర్భాషలకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

    పచ్చిబూతులు మాట్లాడటం కేసీఆర్ కు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన భాషపై పలు విమర్శలు రావడం తెలిసిందే. బీజేపీని ఎదుర్కొనే క్రమంలోనే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడంపై అందరిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారడంపై బీజేపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు.

    Also Read: కేసీఆర్ కొత్త వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

    Tags