https://oktelugu.com/

సుశాంత్ చనిపోయే ముందు వరకు రియాతోనే ఉన్నాడా?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన ప్లాట్లో విగతజీవిగా కన్పించాడు. సుశాంత్ మృతితో బాలీవుడ్లో విషాదచాయలు నెలకొన్నాయి. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సుశాంత్ ఆయన అభిమానులు.. కుటుంబ సభ్యులు మాత్రం అతడిని ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసులకు డ్రగ్స్ లింకులు దొరకడంతో సీబీఐ, ఎన్సీబీ రంగంలోకి దిగింది. తీగలాగితే డొంక కదలిన […]

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2020 / 05:55 PM IST
    Follow us on

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన ప్లాట్లో విగతజీవిగా కన్పించాడు. సుశాంత్ మృతితో బాలీవుడ్లో విషాదచాయలు నెలకొన్నాయి. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సుశాంత్ ఆయన అభిమానులు.. కుటుంబ సభ్యులు మాత్రం అతడిని ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలను వ్యక్తం చేశారు.

    ఈ కేసులో పోలీసులకు డ్రగ్స్ లింకులు దొరకడంతో సీబీఐ, ఎన్సీబీ రంగంలోకి దిగింది. తీగలాగితే డొంక కదలిన చందంగా డ్రగ్స్ మాఫియాతో లింకులున్న వారంతా ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు సెలబ్రెటీలను పోలీసులు అదుపులోకి విచారించారు. సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి.. ఆమె సోదరుడు షోవిక్.. డ్రగ్స్ డీలర్ బాసిత్.. శశాంక్ లను పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. ఈ కేసుతో సంబంధం పలువురిని ఎన్సీబీ విచారిస్తూ కీలక విషయాలను సేకరిస్తోంది.

    సుశాంత్ జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే జూన్ 13న అర్ధరాత్రి వరకు సుశాంత్ తో రియా చక్రవర్తి ఉన్నట్లు ఓ ప్రత్యేక సాక్షి చెబుతున్నాడు. ఈ కేసులో సుశాంత్ మాజీ ప్రియురాలు రియాపై  తొలి నుంచి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుశాంత్ ఆదేశాలతో రియా చక్రవర్తి జూన్ 8న అతడి ప్లాట్ నుంచి వెళ్లిపోయినట్లు చెప్పింది. అయితే జూన్ 13న అర్ధరాత్రి సుశాంత్ సింగ్ రియా చక్రవర్తిని ఆమె ప్లాట్ వద్ద డ్రాప్ చేయడం ఓ ప్రత్యక్ష సాక్షి చూసినట్లు కథనాలు వస్తున్నాయి.

    ఇదే విషయాన్ని బీజేపీ ముంబై కార్యదర్శి అడ్వకేట్ వివేకానంద్ గుప్తా ఓ ఛానల్లో మాట్లాడారు. సుశాంత్ చనిపోవడానికి ముందురోజు కూడా రియాను కలుసుకున్నాడని చెప్పారు. జూన్ 13న అర్ధరాత్రి 1నుంచి 1:30 మధ్యలో సుశాంత్.. రియాను తన ప్లాట్లో డ్రాప్ చేసి తిరిగి సుశాంత్ ప్లాట్ చేరుకున్నట్లు ప్రత్యక్ష సాక్షి ఉన్నాడని చెప్పారు. సుశాంత్ మృతిపై ఆ ప్రత్యక్ష సాక్షి నిజాలు చెప్పేందుకు రెడీ ఉన్నాడని చెప్పాడు.

    ఇంతకముందు కర్ణి సేన నాయకుడు సుర్జీత్ సింగ్ రాథోడ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాడు. దీంతో జూన్ 13న అసలు ఏం జరిగిందనే విషయం అందరిలో ఆసక్తిని రేపుతోంది. సుశాంత్ ఆత్మహత్య కేసు రోజుకో ట్వీస్ట్ తలపిస్తూ సస్పెన్స్ థ్రిలర్ ను తలపిస్తుండటం గమనార్హం.