
4 నెలలుగా సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ వెంకట్రావు కనిపించకుండా పోయాడు. స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా రాయవరం వెళ్లేందుకు సెలవు కోసం ఢిల్లీ ధౌలాకువాలోని సీఐఎస్ఎఫ్ ఆఫీసుకు వెంకట్రావు వెళ్లాడు. జూన్ 4న వెంకట్రావు అదృశ్యంపై ఉస్మాన్‌పూర్ పీఎస్‌లో సీఐఎస్ఎఫ్ ఫిర్యాదు చేసింది. వెంకట్రావు కుటుంబ సభ్యులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి.. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో మిస్సింగ్ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచికి హైకోర్టు అప్పగించింది. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.